పచ్చి జామకాయ మంచిదా? పండినది మంచిదా? అసలు నిజం ఇదే!
Health Benefits of Eating Guavas : పచ్చి జామకాయ vs పండిన జామకాయ: ఏది తింటే ఆరోగ్యానికి మంచిది? జామకాయల్లో దాగి ఉన్న విటమిన్-సి, ఫైబర్ వల్ల కలిగే ప్రయోజనాలు, మరియు మీ శరీర తత్వానికి ఎలాంటి జామకాయలు సరిపోతాయో ఈ బ్లాగ్ పోస్ట్‌లో పూర్తి సమాచారం తెలుసుకోండి.
జామకాయలు ఎలాంటి వాటిని తినాలి… జామకాయ వలన కలిగే మేలు…. అన్నదానిపై చాలామందికి అవగాహన ఉండదు. మరీ పచ్చిగా ఉన్న జామకాయల్లో పాస్పారిక్, ఆక్సాలిక్ వంటి ఆమ్లాలు ఉంటాయి. వాటిని తింటే కడుపు నొప్పి వస్తుంది. అదేవిధంగా ఎక్కువగా గింజలు ఉన్న జామపళ్లను తింటే అపెండిసైటిస్( 24 గంటల జబ్బు) వచ్చే ప్రమాదం ఉంది.

అందువల్ల దోరగా పండిన జామ పండును గానీ, లేదంటే గింజలు తక్కువ ఉన్న జామకాయను కానీ తినాలి. ఇక జామకాయల్లో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. దంతాలు, చిగుళ్లనుంచి రక్తం కారేవారు జామకాయను కొరికి, బాగా నమిలి చప్పరించి ఆ పిప్పిని ఊసేయాలి. ఇలా చేయటం వల్ల రక్తం కారటం ఆగిపోవటమేకాదు దంతాలకు మేలు కలుగుతుంది.
గుండె బలహీనంగా ఉన్నవారు, క్షయవ్యాధితో బాధపడేవారు, బహిస్టు నొప్పులు అధికంగా ఉన్నవారు పండిన జామగుజ్జుతో తేనె, పాలు కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు సౌందర్యానికి జామ ఎంతో ఉపయోగపడుతుంది. జామ ఆకులను మెత్తగా నూరి ముఖంమీద వచ్చే మొటిమలకు రాసినట్లయితే అవి తగ్గిపోతాయి.
జామకాయలు ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల, జామకాయలను ఎక్కువగా తినడం వల్ల ప్రేగు కదలికలకు సహాయపడి మలబద్దకాన్ని నివారిస్తుంది. జామ ఆకు సారం కూడా మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

