Healthhealth tips in telugu

రోజూ ఇవి 3 తింటే చాలు.. చెడు కొలెస్ట్రాల్, థైరాయిడ్ మాయం!

Health Benefits Of Hazelnuts : రక్తనాళాల్లో బ్లాక్స్ (Heart blocks) తొలగించడానికి, చెడు కొలెస్ట్రాల్ కరిగించడానికి, థైరాయిడ్ సమస్యను సహజంగా అదుపులో ఉంచుకోవడానికి రోజుకు 3 చొప్పున తినాల్సిన బెస్ట్ సూపర్ ఫుడ్ ఏంటో ఈ బ్లాగ్ పోస్ట్‌లో వివరంగా తెలుసుకోండి. బెస్ట్ హెల్త్ టిప్స్ మీకోసం.

మనకు ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజ నాలు కలుగుతాయి. ఈ రోజు Hazelnuts గురించి తెలుసుకుందాం. రోజులో 3 నట్స్ తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగి రక్త నాళాల్లో అడ్డంకులను తొలగించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
hazelnuts
అలాగే డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. శరీరంలో అన్నీ రకాల నొప్పులను తగ్గిస్తుంది. వీటిల్లో ఉండే మాంగనీస్ థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగు పరచి ధైరాయిడ్ సమస్యలు లేకుండా చేస్తుంది. యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు.

అలాగే వాటిల్లో ఉండే ప్రొ ఆంథోసయనిడిన్స్ పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూస్తాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. Hazelnuts లో విటమిన్ E,ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్,ఫైబర్ సమృద్దిగా ఉంటాయి. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సమస్యలు లేకుండా చేయటమే కాకుండా మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది.

ఈ నట్స్ బరువు తగ్గటానికి కూడా సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండుట వలన ఫ్రీ రాడికల్స్ నుండి సెల్ డ్యామేజ్‌ను తగ్గిస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన వాపు,మంటను తగ్గించటానికి సహాయపడుతుంది. అలెర్జీ ఉన్నవారు ఈ నట్స్ తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."