Kitchenvantalu

ఫ్రిజ్‌లో తరిగిన ఉల్లిపాయలు పెడుతున్నారా? ఈ ప్రమాదం తప్పదు!

Onions In Fridge : చాలా మంది వంట పని సులభం కావాలని ఉల్లిపాయలను ముందుగానే కోసి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు పడతాయో మీకు తెలుసా?

తెరిచి ఉన్న ఉల్లిపాయలు గాలిలోని బ్యాక్టీరియాను మరియు విష పదార్థాలను త్వరగా ఆకర్షిస్తాయి. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ ఆర్టికల్‌లో తరిగిన ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో దాచడం వల్ల కలిగే నష్టాలు మరియు వాటిని నిల్వ చేయడానికి సరైన పద్ధతులు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.

తరిగిన ఉల్లి ముక్కలు ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా ..అయితే సమస్యలే..ప్రతి రోజు ఉల్లిపాయలను వంటలలో వాడుతూ ఉంటాం. ఒక్కోసారి కోసిన ఉల్లిపాయ ముక్కలు మిగిలిపోతూ ఉంటాయి. అలా మిగిలిన ఉల్లిపాయ ముక్కలను ఫ్రిజ్ లో పెట్టి మరుసటి రోజు వాడుతూ ఉంటారు.

ఇలా మనలో చాలా మంది చేస్తూ ఉంటారు. అలా చేయటం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. పచ్చి ఉల్లిపాయ వాసన ఇతర కూరగాయలను కూడా చెడిపోయేలా చేస్తుంది. ఇందులో సల్ఫర్ ఉండుట వలన ఉల్లిపాయలను కోసేటప్పుడు కంటి నుండి నీరు కారుతుంది.

అలాగే ఉల్లిపాయలను కోసి ఫ్రిజ్‌లో పెడితే బ్యాక్టీరియా పెరుగుతుంది. అంతేకాక పోషక విలువలు తగ్గుతాయి. అది ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అయితే ఉల్లిపాయ ముక్కలను ఫ్రిజ్ లో నిల్వ చేయాలంటే ఇలా చేస్తే సరిపోతుంది.

ఉల్లిపాయలను నిల్వ చేయాలంటే గాలి చొరబడని ఎన్‌క్లోజర్‌ను ఉపయోగించాలి. కోసిన ఉల్లిపాయ ముక్కలను ఫ్రిజ్ లో పెట్టిన సరే రెండు రోజుల కన్నా ఎక్కువ రోజులు నిల్వ చేయకూడదు.

ఏది ఏమైనా ఉల్లిపాయను అవసరం అయినప్పుడు కోసి వాడటం మంచిది. తప్పనిసరి అయినప్పుడు మాత్రమే ఈ విధంగా చేయాలి. ఉల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."