అచ్చం స్వీట్ షాప్ రుచిలా బెల్లం గవ్వలు పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇలా చేయండి!
Bellam Gavvalu:పండగలు వచ్చినా లేదా ఇంట్లో ఏదైనా స్పెషల్ స్నాక్స్ చేయాలన్నా ట్రెడిషనల్ స్వీట్ అయిన ‘బెల్లం గవ్వలు’ ఎప్పుడూ ముందుంటాయి. అయితే చాలా మందికి ఇవి గట్టిగా రావడం లేదా పాకం ముదరడం వంటి సమస్యలు వస్తుంటాయి.
బయట కరకరలాడుతూ, లోపల జ్యూసీగా పర్ఫెక్ట్ స్వీట్ షాప్ రుచితో బెల్లం గవ్వలు రావాలంటే పిండిని ఏ విధంగా కలపాలి? పాకం ఎలా పట్టాలి? అనే పూర్తి వివరాలు ఈ పోస్ట్‌లో చూసేయండి.
ఈ కొలతలతో చేస్తే మొదటిసారి చేసేవారు కూడా ఎంతో సులువుగా పర్ఫెక్ట్ బెల్లం గవ్వలు చేయవచ్చు! బెల్లం గవ్వలు క్రిస్పీగా టేస్టీగా రావాలంటే పిండిని ఇలా కలిపి చూడండి….చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
కావలసిన పదార్దాలు
గోధుమ పిండి– 500గ్రా,బొంబాయిరవ్వ– 100గ్రా,నెయ్యి– 120గ్రా,బెల్లం– 150గ్రా,గుడ్డు-1,యాలకులు -5 గ్రా,బేకింగ్‌పౌడర్– చిటికెడు,రిఫైన్డ్‌ఆయిల్– వేయించడానికి తగినంత
తయారుచేసేవిధానం
ఒక గిన్నెలో కోడిగుడ్డు సొనను తీసుకోని స్పూన్‌తో బాగా గిలకొట్టాలి. అందులో బెల్లం కూడా వేసి పూర్తిగా కరిగించాలి. అవసరమైతే ఒక కప్పు నీళ్లు కూడాపోయాలి. అందులో యాలకుల పొడిని కూడా చేర్చి ఈ మిశ్రమాన్ని పక్కనపెట్టాలి.
ఇప్పుడు గోధుమ పిండిలో బేకింగ్ సొడా కలిపి జల్లించాలి. దీనిని ఒక బౌల్లోకి తీసుకోని బొంబాయిరవ్వ, నెయ్యి కూడా వేసి బాగా కలపాలి. దీనికి కోడిగుడ్డు మిశ్రమాన్ని చేర్చి గట్టిగా పూరీ పిండిలా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా అంటే చిన్నగోలిసైజులో చేసి ఉంచాలి.
గవ్వల చెక్కెపై బొటన వేలితో పిండిని గట్టిగా అదుముతూ వేలును కిందికి జరపాలి. పిండి చుట్టుకొని గవ్వ తయారవుతుంది. ఈ విధంగా తయారైన గవ్వలను కాగుతున్న నూనెలో వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి.

