Healthhealth tips in telugu

ఈ ఒక్క నూనెతో కీళ్ల నొప్పులు, చేతులు కాళ్ల తిమ్మిర్లకు చెక్!

Joint Pain Oil : వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలు కీళ్ల నొప్పులు, నరాల నొప్పి, మరియు కాళ్లు చేతుల తిమ్మిర్లు. మారిన జీవనశైలి, సరైన వ్యాయామం లేకపోవడం, పోషకాల లోపం వల్ల ఈ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వీటి కోసం మార్కెట్లో దొరికే రకరకాల పెయిన్ కిల్లర్స్ వాడి విసిగిపోయారా?

అయితే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక సహజమైన నూనెతో ఈ నొప్పులన్నింటికీ సులువుగా చెక్ పెట్టవచ్చు. ఆ అద్భుతమైన ఆయిల్ ఏమిటి? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఎలా రాసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది? అనే పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ఈ రోజుల్లో సమస్యలు అయితే చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. ఆ సమస్యలు తగ్గాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటి వాటిలో నొప్పులు ఒకటి. నొప్పులు వచ్చినప్పుడు మనలో చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడేస్తూ ఉంటారు. అలా మందులు వాడకుండా ఇప్పుడు చెప్పే నూనెను వాడితే మంచి ఉపశమనం కలుగుతుంది.
nutmeg
రెండు జాజికాయలను పొడిగా చేసుకోవాలి. ఒక గిన్నెలో 6 స్పూన్ల ఆవనూనె,రెండు స్పూన్ల ఆముదం వేసి మరిగించాలి. మరిగాక ఆ నూనెలో జాజికాయ పొడి వేసి బాగా కలిపి పొయ్యి ఆఫ్ చేయాలి. ఈ నూనె చల్లారాక సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

ఇలా నొప్పులు ఉన్నప్పుడు రాత్రి సమయంలో ఈ నూనెను రాసుకొని మసాజ్ చేసి పడుకుంటే మంచి నిద్ర పట్టటమే కాకుండా నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. జాజికాయ, ఆవనూనెలో ఉన్న లక్షణాలు నొప్పులను తగ్గించటానికి సహాయపడతాయి. ఆవనూనె చర్మం లోపలకు చొచ్చుకొని వెళ్ళి నొప్పులను తగ్గించటంలో సహాయపడుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."