వేడి నీటిలో ఈ రెండు చుక్కలు వేస్తే చాలు.. గొంతులో కఫం ఇట్టే కరిగిపోతుంది!
Cold And Cough : వాతావరణం మారినప్పుడల్లా మనల్ని వెంటనే వేధించే సమస్య జలుబు, దగ్గు. ముఖ్యంగా గొంతులో కఫం లేదా శ్లేష్మం పేరుకుపోయి ఊపిరి పీల్చుకోవడానికి, ఆహారం మింగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎన్ని సిరప్ లు, మందులు వాడినా వెంటనే ఫలితం ఉండకపోవచ్చు.
కానీ, మన ఇంట్లో ఉండే సహజమైన వస్తువులతో చేసే ఒక చిన్న చిట్కాతో గొంతులోని కఫం నిమిషాల్లో కరిగిపోతుంది. ఆ అద్భుతమైన చిట్కా ఏంటి? వేడి నీటిలో ఏవి వేసి వాడాలి? అనే విషయాలను ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.
దగ్గు వచ్చిందంటే ఒక పట్టానా తగ్గదు. అలాగే గొంతులో కఫం,శ్లేష్మం వంటివి ఉన్నప్పుడూ కూడా బయటకు రావటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముందుగా కఫం,శ్లేష్మం తగ్గించుకోవటానికి ఇప్పుడు చెప్పే రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త ఓపికగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చెప్పే నూనెను మరిగించిన నీటిలో వేసి ఆవిరి పట్టాలి.

దీని కోసం ఒక సీసాలో 6 ml కొబ్బరి నూనె,1 ml పుదీనా నూనె,1 ml యూకలిప్టస్ నూనె, 1 ml లవంగం నూనె వేసి బాగా కలిపి నిల్వ చేసుకోవాలి. దగ్గు,కఫం,శ్లేష్మం ఉన్నప్పుడూ నీటిని బాగా మరిగించి ఆ నీటిలో పైన తయారుచేసుకున్న నూనెను రెండు చుక్కలు వేసుకొని ఆవిరి పట్టాలి. ఈ విధంగా రోజులో రెండు సార్లు చేస్తే మంచి ఉపశమనం కలుగుతుంది.
మనం తీసుకున్న నూనెలలో కొబ్బరి నూనె తప్ప మిగతా అన్నీ నూనెలు ఘాటుగా ఉంటాయి. వీటిని ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు. ఈ నూనెను ఎక్కువ మోతాదులో వాడకూడదు. ఎందుకంటే ఊపిరితిత్తులకు హాని కలిగే అవకాశం ఉంది. గర్భధారణ సమయంలో కూడా ఈ నూనెను వాడకూడదు. ఈ నూనె నొప్పులను తగ్గించటంలో కూడా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

