Healthhealth tips in telugu

ఉక్కులాంటి ఎముకల కోసం దీన్ని ఇలా తీసుకోండి.. నొప్పులన్నీ మాయం!

Joint pains Foods : వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలు కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు. కాల్షియం లోపం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ఎముకలు బలహీనపడి చిన్న వయసులోనే ఈ నొప్పులు మొదలవుతున్నాయి.

అయితే, మనం తీసుకునే ఆహారంలో ఒక చిన్న మార్పు చేసి, ఈ పదార్థాన్ని సరైన పద్ధతిలో తీసుకుంటే ఎముకలు అమాంతం గట్టిపడతాయి. జీవితంలో మళ్లీ కీళ్ల నొప్పులు దరిచేరకుండా కాపాడే ఆ అద్భుతమైన పద్ధతి ఏమిటో ఈ ఆర్టికల్‌లో వివరంగా చూద్దాం.

శరీర నిర్మాణంలో ఎముకలదే ప్రధాన పాత్ర. మన శరీరం ఏ విధమైన మార్పులకు లోను అవుతుందో,ఎముకలు కూడా అదే విధమైన మార్పులకు లోను అవుతాయి. శరీరంతో పాటు ఎముకలు కూడా పెరుగుతాయి. ఒక విధంగా చెప్పాలంటే ఎముకలకు,శరీరానికి అవినాభావ సంబందం ఉంది. శరీరం చురుకుగా కదలాలంటే ఎముకలు ఆరోగ్యంగా,బలంగా ఉండాలి.

ఎముకలు బలహీనపడితే శరీర కదలికలలో కూడా చురుకుదనం తగ్గుతుంది. శరీరం మొత్తం మీద 206 దాక ఎముకలు ఉంటాయి. ఇంత ప్రాముఖ్యం,అధిక సంఖ్యలో ఉన్న ఎముకలు గట్టిగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవటం తప్పనిసరి. ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి తీసుకోవలసిన ఆహారం గురించి తెలుసుకుందాము.

పాలు
ఎదిగే వయస్సులో క్రమం తప్పకుండా పిల్లలకు పాలు ఇవ్వటం అనేది వారి శారీరక ఎదుగుదలకే కాకుండా ఎముకల గట్టితనానికి కూడా చాలా మంచిది. పాలలో కాల్షియం,జింక్,ప్రోటీన్,ప్యాట్,విటమిన్ ఎ,డి పుష్కలంగా లభిస్తాయి.

పెరుగు
శరీరానికి కావలసిన కాల్షియం సక్రమంగా అందకపోతే ఎముకలు బలహీనపడతాయి. కాల్షియం పెరుగులో పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు గడ్డ పెరుగులో 300 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది.

సోయా
సోయలో ప్రకృతి సిద్దంగా లభించే ఐసోఫ్లావెన్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవే కాకుండా విటమిన్స్,మినరల్స్ కూడా ఉంటాయి. చిన్నతనం నుండి సోయాను తీసుకోవటం అలవాటు చేస్తే ఎముకలు దృడంగా,ఆరోగ్యంగా ఉంటాయి.

నట్స్,సీడ్స్
వీటిలో పోషకాలు,విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీర ఆరోగ్యానికి,ఎదుగుదలకు ఎంతగానో తోత్పడతాయి. బాదంపప్పు,వేరుశనగపప్పు లలో పోటాషియం ఎక్కువగా ఉంటుంది. పోటాషియం మూత్రం ద్వారా కాల్షియం పోకుండా అడ్డుకుంటుంది. అంతేకాక ఎముకలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

సూర్యరశ్మి
సూర్యరశ్మి అనే దానిని ఆహారంగా తీసుకోలేము. ఆహారంగా కాకపోయినా శరీరానికి కావలసిన విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. శరీరానికి అవసరమైన విటమిన్ డి అందకపోతే ఆహారం ద్వారా తీసుకున్న కాల్షియం సక్రమంగా విలీనం కాదు. ఉదయం సమయంలో ఎండలో కొంతసేపు ఉంటే శరీరానికి అవసరమైన విటమిన్ D అందుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."