Beauty TipsHealthhealth tips in telugu

ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ అద్భుతమైన సీక్రెట్ మిస్ కావద్దు!

White Hair Turn Black:వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య తెల్ల జుట్టు. దీన్ని కవర్ చేయడానికి మార్కెట్లో దొరికే రకరకాల డైలు, కలర్స్ వాడి జుట్టును మరింత పాడు చేసుకుంటున్నారు.

అయితే ఎలాంటి కెమికల్స్ అవసరం లేకుండా, మన చుట్టుపక్కలే దొరికే ఒక అద్భుతమైన ఆకుతో మీ తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చుకోవచ్చు. ఎవరికీ పెద్దగా తెలియని ఆ ఆకు ఏంటి? దానితో నాచురల్ హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడే చూద్దాం.

తెల్ల జుట్టును నల్లగా మార్చే అద్భుతమైన ఆకు…అసలు మిస్ కావద్దు.. ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా యుక్త వయస్సులోనే తెల్లజుట్టు వచ్చేస్తోంది దాంతో చాలా బాధపడుతున్నారు. ఒకప్పుడు 60 ఏళ్లు దాటాక మాత్రమే జుట్టు తెల్లగా మారేది. కానీ ప్రస్తుతం మారిన జీవన శైలి పరిస్థితుల కారణంగా చాలా తక్కువ వయసులోనే అంటే 30 ఏళ్లకే జుట్టు తెల్లగా మారిపోతుంది.

దాంతో మానసికంగా కృంగిపోయి రంగులు వేయడం స్టార్ట్ చేసేస్తున్నారు.రంగులు అనేవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి. అంతేకాకుండా జుట్టు రాలే సమస్య కూడా పెరిగిపోతుంది. అదే సహజసిద్ధమైన చిట్కాలు ఫాలో అయితే తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది దీని కోసం గుంటకలగర ఆకు చాలా బాగా పనిచేస్తుంది. ఇది పల్లెటూర్లలో ఎక్కడపడితే అక్కడ ఉంటుంది.

మార్కెట్లో కూడా లభ్యమవుతుంది. గుంటకలగర ఆకులో ఉండే లక్షణాలు జుట్టును నల్లగా మార్చుతాయి. కొన్ని గుంటకలగర ఆకులను తీసుకొని బాగా ఎండబెట్టి పొడి తయారు చేసుకోవాలి. ఈ పొడిని నువ్వులనూనె లో వేసి బాగా కలిపి జుట్టుకు పట్టించి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి గంటయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.

ఈ విధంగా వారానికి రెండుసార్లు చేస్తుంటే మంచి ఫలితం వస్తుంది. గుంటకలగర ఆకు పొడి రూపంలో మార్కెట్లో దొరుకుతుంది ఫ్రెష్ గా ఉన్న ఆకు దొరికిన సరే లేదా మార్కెట్లో దొరికే పొడిని ఆయన ఉపయోగించవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."