Kitchenvantalu

కరకరలాడే ‘దాల్ ముడి మిక్చర్’.. అచ్చం స్వీట్ షాప్ స్టైల్ రుచితో ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

Dal Mudi Mixture Recipe: చిన్న పిల్లలు, పెద్ద వాళ్లు ఎవరికైనా సరే, సరదాగా చిరుతిల్లు కావాలనిపిస్తుంది. టీ టైమ్ లోనో టీవీ చూస్తూనే, టైమ్ పాస్ కి అనో, తినే మిక్చర్, పప్పుతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

సాయంత్రం వేడి వేడి టీ లేదా కాఫీ తాగుతూ ఏదైనా కరకరలాడే స్నాక్ తింటే ఆ మజాయే వేరు కదా! సాధారణంగా ఇలాంటి క్రంచీ స్నాక్స్ కోసం మనం స్వీట్ షాప్స్ లేదా బేకరీల మీద ఆధారపడుతుంటాం. కానీ, ఎంతో పాపులర్ అయిన ‘దాల్ ముడి మిక్చర్’ను మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా?

కొన్ని సింపుల్ టిప్స్, పక్కా కొలతలు పాటిస్తే.. స్వీట్ షాప్ లో కొన్నదానికంటే ఎంతో టేస్టీగా, కరకరలాడుతూ వస్తుంది. బయట వాడే నూనె కాకుండా, మన ఇంట్లో మంచి నూనెతో చేస్తాం కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ భలే ఇష్టంగా తినే ఈ ‘దాల్ ముడి మిక్చర్’ పర్ఫెక్ట్‌గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం!

కావాల్సిన పద్ధార్థాలు
మసూర్ దాల్ – 1 కప్పు
నూనె – వేపుకోడానికి
ఉప్పు – తగినంత
బ్లాక్ సాల్ట్ – 1/2టీ స్పూన్
కారం – 3/4 టీ స్పూన్
జీలకర్ర పొడి – 1/2టీ స్పూన్

కారం పూస కోసం..
శనగపిండి – 200 గ్రాములు
నీళ్లు – 250 ML
ఉప్పు – తగినంత
ఎల్లో కలర్ – 2 చిటికెలు

తయారీ విధానం
1.కారపూస కోసం ఒక గిన్నెలోకి పక్కకు పెట్టుకున్న పదార్ధాలు అన్ని తీసుకుని, పిండిని మెత్తగా కలుపుకోవాలి.
2. స్టవ్ పై బాండీ పెట్టి, ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, మరిగే నూనెలో, సన్నని రంధ్రాల్లో కారపూస మిషన్ తో వత్తుకోవాలి.
3. ఎర్రగా వేపుకుని, రెండు వైపులా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు రాత్రంతా నానిన పప్పును, వడకట్టి, మరిగే నూనెలో వేసి, మీడియం ఫ్లేమ్ పై మగ్గనివ్వాలి.
5. తర్వాత హై ఫ్లేమ్ పై ఎర్రగా వేపుకుని, బయటికి తీసుకోవాలి.
6. వేపుకున్న పప్పులలో , ముందుగా వేపుకున్న కారపూస నలిపి కలుపుకోవాలి.
7. అందులోకి ఉప్పు, బ్లాక్ సాల్ట్ , కారం, జీలకర్ర, పొడి బాగా మిక్స్ చేసుకుని, ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వపెట్టుకోవాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."