గంటల కొద్దీ వంటగదిలో పనితో విసిగిపోయారా? మీ శ్రమను తగ్గించే బెస్ట్ కిచెన్ టిప్స్ ఇవే!
Useful Kitchen Tips in Telugu:ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఇల్లాలు ఎక్కువ సమయం గడిపేది వంటగదిలోనే. వంట చేయడం, కూరగాయలు తరగడం, గిన్నెలు సర్దడం, కిచెన్ శుభ్రం చేయడం.. ఇలా పనులతోనే సమయం అంతా ఇట్టే గడిచిపోతుంది.
చాలాసార్లు ఈ పనుల వల్ల శారీరకంగా ఎంతో అలసిపోతుంటారు. అయితే, కొన్ని చిన్న చిన్న స్మార్ట్ ట్రిక్స్ (Smart Kitchen Hacks) తెలిస్తే ఈ వంటగది పనులను చాలా వేగంగా, సులభంగా పూర్తి చేయవచ్చు.
వంటను రుచిగా మార్చడంతో పాటు, మీ శ్రమను సగానికి తగ్గించి, డబ్బు మరియు సమయాన్ని ఆదా చేసే ఆ అద్భుతమైన కిచెన్ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ చిట్కాలు పాటిస్తే వంటగదిలో మీ పని ఎంతో సులభం అవ్వడమే కాకుండా, మీరు కూడా ఒక స్మార్ట్ ఇల్లాలుగా మారిపోతారు!
అన్నం వండినప్పుడు మెత్తగా అయ్యిపోతూ ఉంటుంది. ఆలా మెత్తగా అవ్వకుండా అన్నం పొడి పొడిగా రావాలంటే అన్నం వండేటప్పుడు కొంచెం వంట నూనెను వేసి వండితే అన్నం పొడి పొడిగా మెతుకు మెతుకు అతుక్కోకుండా పొడిగా ఉంటుంది.
కాకరకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టిన ఒకోసారి పండిపోతూ ఉంటాయి. ఆలా పండి పోకుండా కాకరకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కాకరకాయను ఈ విధంగా కట్ చేసి నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
వంటగదిలో చీమలు సాధారణంగా వస్తూనే ఉంటాయి. ఒక పట్టాన పోవు. చీమలు పోవాలంటే ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దోసకాయను కట్ చేసి దోసకాయ ముక్కను చీమలు ఉన్న ప్రదేశంలో పెడితే చీమలు పారిపోతాయి.
వంటగదిలో ఏ పని చేస్తున్న ఈగలు వచ్చేస్తుంటాయి. ఈగలు ఒక్కసారి వచ్చాయంటే ఒక పట్టానా పోవు. ఈ వేసవిలో అయితే ఈగలు చాలా ఎక్కువగా వస్తాయి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈగలు పోవాలంటే ఈ చిట్కా చాలా బాగా సహాయాపడుతుంది. ఈగలు ఉన్న ప్రదేశంలో పసుపు నీటిని జల్లితే ఈగలు రావు.
బొద్దింకలతో ఇబ్బందిగా ఉంటె ఈ చిట్కా బాగా యూజ్ అవుతుంది. వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చిగా దంచి నీటిలో కలిపి బొద్దింకలు ఉన్న ప్రదేశంలో పెడితే ఆ ఘాటుకి బొద్దింకలు పారిపోతాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

