కేవలం 7 రోజుల్లో ఊపిరితిత్తుల్లోని కఫం, శ్లేష్మం మొత్తం మాయం.. ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి!
How to Get Rid of Mucus in Chest In Telugu : వాతావరణంలో మార్పులు, కాలుష్యం లేదా చల్లటి పదార్థాలు తినడం వల్ల చాలామందికి తరచుగా జలుబు, దగ్గు వస్తుంటాయి. అయితే జలుబు తగ్గినప్పటికీ, ఊపిరితిత్తులలో కఫం, శ్లేష్మం పేరుకుపోయి ఛాతీ పట్టేసినట్లుగా అనిపిస్తుంది.
దీనివల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారడమే కాకుండా, రాత్రి పూట తీవ్రమైన దగ్గుతో నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఎన్నో కాఫ్ సిరప్స్, మందులు వాడినా ఈ మొండి కఫం వదలట్లేదా? అయితే ఇక ఆందోళన వద్దు.
మన వంటగదిలో దొరికే కొన్ని న్యాచురల్ పదార్థాలతో కేవలం 7 రోజుల్లో మీ ఊపిరితిత్తులను పూర్తిగా డీటాక్స్ (Detox) చేసి శుభ్రం చేసుకోవచ్చు. పేరుకుపోయిన శ్లేష్మాన్ని కరిగించి, శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేసే ఆ అద్భుతమైన ఇంటి చిట్కా ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం!
ఈ రోజు ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కఫం మరియు శ్లేష్మం తొలగించుకోవటానికి కొన్ని ఇంటి చిట్కాలను తెలుసుకుందాం. ఊపిరితిత్తులలో కఫం మరియు శ్లేష్మం ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవటం చాలా కష్టం అవుతుంది. దీని కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

మన శరీరంలోని టాక్సిన్లను బయటకు తీయడంలో ఊపిరితిత్తులు సహాయపడతాయి. మన శరీరం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే, ఊపిరితిత్తులు బాగా పనిచేయాలి. ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుండి ఫిల్టర్ చేసిన తర్వాత మాత్రమే శరీరంలోని ప్రతి భాగానికి చేరుకుంటుంది. కాబట్టి ఊపిరితిత్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం.
ప్రతి రోజు ఆవిరి పట్టాలి. ఆవిరి పట్టే నీటిలో పసుపు,తులసి ఆకులను వేయాలి. ఉదయం సమయంలో తేనె,నిమ్మరసం గంటలో రెండు సార్లు తీసుకోవాలి. శ్వాసకు సంబందించి వ్యాయామాలు చేయాలి. అలాగే రాత్రి పడుకున్నప్పుడు కాళ్ళ కింద ఎత్తు పెట్టుకోవాలి. ఇలా చేస్తే కేవలం వారంలో రోజుల్లోనే కఫం,శ్లేషం తగ్గి ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి.
తులసి ఆకులలో పొటాషియం, ఐరన్, క్లోరోఫిల్, మెగ్నీషియం, కెరోటిన్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి రోజూ 4-5 తులసి ఆకులు తినడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా మరియు శుభ్రంగా ఉండటానికి తులసి తీసుకోవచ్చని ఆయుర్వేద వైధ్య నిపుణులు చెప్పుతున్నారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

