60 ఏళ్ల వయసులోనూ 20లా యాక్టివ్‌గా ఉండాలా? రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క గ్లాసు డ్రింక్ తాగండి చాలు!
sesame seeds And almonds : వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో శక్తి తగ్గడం, చిన్న పనికే అలసిపోవడం, కీళ్ల నొప్పులు, నీరసం రావడం చాలా సహజం. చాలామంది 50, 60 ఏళ్లు వచ్చేసరికి మునుపటిలా యాక్టివ్‌గా ఉండలేక సతమతమవుతుంటారు.
కానీ, సరైన పోషకాలు తీసుకుంటే వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే! విటమిన్ ట్యాబ్లెట్స్, మందుల చుట్టూ తిరిగే పనిలేకుండా మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతోనే ఒక అద్భుతమైన ఎనర్జీ బూస్టర్‌ను తయారు చేసుకోవచ్చు.
రాత్రి పడుకునే ముందు కేవలం ఒక్క గ్లాసు ఈ డ్రింక్ తాగితే చాలు.. మరుసటి రోజు ఉదయం లేచేసరికి మీలో ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది. 60 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల వ్యక్తిలా రోజంతా ఎంతో ఉత్సాహంగా, యాక్టివ్‌గా పనులు చేసుకోగలుగుతారు.
నొప్పులు, నీరసాన్ని తరిమికొట్టి మీ స్టామినాను రెట్టింపు చేసే ఆ మ్యాజిక్ డ్రింక్ ఏంటి? దాన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం!
శరీరంలో బలహీనత, calcium లోపం కారణంగా ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. ఒక వేళ చేయటానికి ప్రయత్నం చేసిన చేయలేక తీవ్రమైన అలసట,నీరసం ఉంటాయి. ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే తక్షణ శక్తి లభిస్తుంది. ఈ వేసవికాలంలో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది.

దీనికోసం ముందుగా పాన్ లో రెండు స్పూన్ల నువ్వులు, 5 బాదంపప్పులు, రెండు స్పూన్ల గసగసాలను వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఎక్కువ మోతాదులో తయారుచేసుకొని నిల్వ చేసుకోవచ్చు. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పోసి దానిలో ఒక స్పూన్ పొడిని వేసి మూడు పొంగులు వచ్చాక చిన్న బెల్లం ముక్క వేసి ఒక నిమిషం అయ్యాక గ్లాసులో పోయాలి.
డయాబెటిస్ ఉన్నవారు బెల్లం లేకుండా తాగాలి. ఈ పాలను రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తాగాలి. ఈ విధంగా తాగటం వలన నిద్రలేమి సమస్య నుండి బయట పడతారు. calcium లోపం కారణంగా వచ్చే అన్నీ రకాల సమస్యలు తొలగి పోతాయి. నువ్వుల్లో ఉన్న ఫైబర్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.
బాదంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. గసగసాలు జీర్ణ సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది. తలనొప్పి,దగ్గు,ఉబ్బసం వంటి వాటిని తగ్గిస్తుంది. ఈ పొడిని తీసుకోవటం 60 లో కూడా మంచి శక్తితో అలసట లేకుండా ఉంటారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

