Kitchenvantalu

ఇంట్లో చేసే పన్నీర్ గట్టిగా విరిగిపోతోందా? అచ్చం షాప్‌లో లాగా సాఫ్ట్‌గా రావాలంటే ఈ చిన్న ట్రిక్స్ పాటించండి!

Homemade Paneer Recipe in telugu:పన్నీర్ బటర్ మసాలా, కడాయ్ పన్నీర్, పన్నీర్ టిక్కా.. పేరు వింటేనే నోరూరిపోతుంది కదా! అయితే బయటకెళ్లి కొనే పనిలేకుండా ఇంట్లోనే పన్నీర్ తయారు చేద్దామని చాలామంది ట్రై చేస్తుంటారు.

కానీ, పాలు విరగ్గొట్టి పన్నీర్ చేశాక అది గట్టిగా రబ్బరులా మారడమో లేదా వండేటప్పుడు ముక్కలు ముక్కలుగా విరిగిపోవడమో జరుగుతుంది. ఇలా మీరు చేసిన పన్నీర్ పాడైపోయిందని నిరాశ పడుతున్నారా? అయితే ఇకపై ఆ టెన్షన్ వద్దు!
Raw Paneer Benefits
పాలు విరగ్గొట్టే విధానం నుంచి, దానిపై బరువు పెట్టే వరకు.. కొన్ని సింపుల్ అండ్ సీక్రెట్ టిప్స్ పాటిస్తే, అచ్చం స్వీట్ షాపుల్లో దొరికేంత సాఫ్ట్‌గా, స్పాంజీలాంటి పన్నీర్‌ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అసలు పన్నీర్ విరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం!

పన్నీర్ అంటే మనలో చాలా మంది చాలా ఇష్టంగా తింటారు. పనీర్ తో ఎన్నో రకాల కూరలు, స్వీట్స్, మసాలా వైరైటిలు చేస్తూ ఉంటాం. మనలో చాలా మంది ఈ పన్నీర్ ని మార్కెట్లో కొంటూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలో చాలా సులభంగా చాలా ఆరోగ్యకరంగా తయారు చేసుకోవచ్చు.

కావలసిన పదార్ధాలు
1 liter చిక్కని పాలు
125 ml వెనిగర్
125 ml నీళ్ళు

తయారి విధానం
అడుగు మందంగా ఉన్న మూకుడులో పాలు పోసి ఒక పొంగు వచ్చాక పొయ్యి మీద నుంచి దింపాలి.ఒక కప్పులో నీరు వెనిగర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేడి పాలలో పోస్తూ కలుపుతూ ఉంటే పాలు విరిగి ముద్దగా అయ్యి నీళ్లు వేరు పడతాయి. వెనిగర్ వేశాక పన్నీర్ రావటానికి దాదాపుగా రెండు నిమిషాల సమయం పడుతుంది.

ఒక జల్లెడలో ఒక వైట్ కాటన్ క్లాత్ వేసి అందులో ఈ పన్నీర్ ని పోసి నీటిని వడగట్టి గట్టిగా పిండాలి. పన్నీర్ ముద్దని క్లాత్ మీద చతురస్రాకారంలోకి సర్ది క్లాత్ తో కప్పి దానిపైన బరువు పెట్టాలి. ఒక అరగంట అలా వదిలేస్తే ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి ఫ్రిజ్లో పెడితే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఫ్రిజ్ లో నుంచి తీసి వాడటానికి ముందు పది నిమిషాలు వేడి నీటిలో ఉంచి వాడుకోవాలి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."