Healthhealth tips in telugu

కేవలం 15 రోజులు ఈ డ్రింక్ తాగితే చాలు.. డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్ మాయం!

kalonji seeds Benefits : మారుతున్న జీవనశైలి, వేళకాని వేళల్లో తినే ఆహారపు అలవాట్ల కారణంగా ఈ రోజుల్లో డయాబెటిస్ (షుగర్), బీపీ, చెడు కొలెస్ట్రాల్, ఊబకాయం వంటి సమస్యలు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నాయి.

ఈ సమస్యలను కంట్రోల్ చేయడానికి రోజూ గుప్పెడు మందులు మింగుతూ విసిగిపోయారా? అయితే ఇక ఆ ఆందోళన వద్దు. మన కిచెన్‌లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతోనే వీటన్నింటికీ చెక్ పెట్టొచ్చు.

మనం చెప్పుకోబోయే ఈ అద్భుతమైన డ్రింక్‌ను కేవలం 15 రోజుల పాటు క్రమం తప్పకుండా తాగితే చాలు.. మీ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి, చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి అధిక బరువు తగ్గుతారు, అంతేకాకుండా గుండె ఎంతో పదిలంగా ఉంటుంది. సర్వ రోగ నివారిణిలా పనిచేసే ఆ మ్యాజిక్ డ్రింక్ ఏంటి? దాన్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం!

ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగించే కలోంజీ సీడ్స్ వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ గింజలతో టీ తయారుచేసుకొని తాగితే డయాబెటిస్,కొలెస్ట్రాల్,రక్తపోటు,అధిక బరువు,గుండె సమస్యలు, రక్త నాళాల్లో బ్లాక్స్ వంటివి అన్నీ తగ్గుతాయి.

రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో అరస్పూన్ కలోంజీ సీడ్స్ వేసి మరుసటి రోజు ఉదయం పొయ్యి మీద పెట్టి 5 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత ఒక స్పూన్ సొంపు వేసి 2 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత పటికబెల్లం ముక్క వేసి ఒక నిమిషం మరిగాక గ్లాస్ లోకి వడకట్టి ఉదయం సమయంలో తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు పటికబెల్లం లేకుండా తాగాలి.

ఊపిరితిత్తులలో నిమ్ము ఉన్నవారు,గొంతులో కఫం ఉన్నవారు,పిత్తాశయంలో సమస్యలు ఉన్నవారు పటికబెల్లం బదులు తేనెను వాడాలి. కలోంజీ సీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది. అయితే కలోంజీ సీడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ గింజలకు వేడి చేసే గుణం ఉంది.

ఈ టీని 15 రోజుల పాటు ఉదయం సమయంలో తాగితే చాలా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కలోంజీ సీడ్స్ ఆయుర్వేదం షాప్ లో లభ్యం అవుతాయి. లేదా Online Stores లో కూడా విరివిగానే లభ్యం అవుతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."