Beauty TipsHealthhealth tips in telugu

ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు: ముడతలు లేని కాంతివంతమైన చర్మం కోసం బెస్ట్ నాచురల్ టిప్స్!

Face Glow Tips:వయసు పెరగడం అనేది సహజ ప్రక్రియ అయినప్పటికీ, ముఖంపై ముడతలు (Wrinkles), సన్నని గీతలు రావడం వల్ల చాలామంది చిన్న వయసులోనే కాస్త పెద్దవారిలా కనిపిస్తుంటారు. దీనికోసం మార్కెట్లో దొరికే ఖరీదైన యాంటీ ఏజింగ్ క్రీమ్స్, కెమికల్ ప్రొడక్ట్స్ వాడి చర్మాన్ని మరింత పాడుచేసుకుంటుంటారు.

అయితే, మీ ముఖంపై వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా, వయసు పెరిగినా మీ స్కిన్ ఎప్పటికీ యవ్వనంగా, కాంతివంతంగా (Young & Glowing) కనిపించడానికి కొన్ని అద్భుతమైన సహజసిద్ధమైన చిట్కాలు మనకు అందుబాటులో ఉన్నాయి.

ఇంట్లోనే లభించే కొన్ని వస్తువులతో చర్మంపై ముడతలను ఎలా నివారించవచ్చో, ముఖాన్ని టైట్‌గా ఎలా మార్చుకోవాలో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం. ముడతలు లేని గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవడానికి ఈ బ్యూటీ సీక్రెట్స్ తప్పక చదివేయండి!

వయస్సు పెరిగిన ముడతలు లేకుండా ముఖం యంగ్ లుక్ లో కనపడాలంటే.. మనలో చాలా మంది ముఖం మీద ముడతలు, నల్లని మచ్చలు లేకుండా ఉండాలని కోరుకుంటారు. దీని కోసం ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు.

ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో ముఖాన్ని యంగ్ లుక్ గా మార్చుకోవచ్చు. దీని కోసం ఒక బౌల్ లో ఒక స్పూన్ వేరుశనగ, ఒక స్పూన్ నువ్వులను వేసి మూడు స్పూన్ల పాలను పోసి గంట సేపు నానబెట్టాలి.

నానిన తర్వాత మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ నుంచి పాలను వడకట్టాలి. ఈ పాలతో ప్యాక్ తయారుచేసుకోవాలి. ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ తేనె,ఒక స్పూన్ ఆలోవెరా జెల్ వేసి పైన తయారుచేసుకున్న పాలను పోసి బాగా కలిపి ముఖానికి రాయాలి. పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చర్మం ముడతలు లేకుండా యవ్వనంగా మెరుస్తూ ఉంటుంది. వేరుశనగలో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటమే కాకుండా వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తాయి. చర్మం యవ్వనంగా,ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. నువ్వులు ముఖానికి మంచి మెరుపును ఇస్తుంది.

శనగపిండి చర్మంపై మృతకణాలను తొలగిస్తుంది. అలాగే తేనె చర్మంపై తేమ ఉండేలా చేస్తుంది. ఆలోవెరా చర్మాన్ని కాంతివంతంగా మృదువుగా ఉండేలా చేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."