జుట్టు కుదుళ్లను బలంగా మార్చి, రాకెట్ వేగంతో జుట్టును పెంచే మ్యాజిక్ హెయిర్ ఆయిల్ ఇదే!
Hair Care Tips:పొడవాటి, ఒత్తైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో వాతావరణ కాలుష్యం, పోషకాల లోపం, చుండ్రు వంటి సమస్యల వల్ల జుట్టు రాలిపోతూ పల్చగా మారుతుంది. అయితే, మీ జుట్టు కుదుళ్ల నుంచి బలంగా తయారై, మోకాళ్ల వరకు పొడవుగా పెరగడానికి ఒక అద్భుతమైన హెయిర్ ఆయిల్ ఉంది.
ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే ఈ నూనెను వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గి, రెట్టింపు వేగంగా పెరుగుతుంది. ఇంతకీ ఆ మ్యాజిక్ నూనె ఏంటి? అందులో వాడే పదార్థాలు ఏమిటి? జుట్టుకు ఎలా అప్లై చేయాలి? అనే పూర్తి వివరాలను ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం. మీ జుట్టును బలంగా, పొడవుగా మార్చుకునే ఈ సీక్రెట్ ఆయిల్ తయారీ విధానం చూసేయండి!

మోకాళ్ల వరకు హెయిర్ పెరగడానికి ఈ నూనె చాలు.. ఇలా వాడితే జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారుతుంది.. జుట్టు రాలే సమస్య ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది.
మగవారిలో అయితే జుట్టు బాగా రాలిపోయి బట్టతల కూడా వచ్చేస్తుంది. అలాంటప్పుడు అసలు కంగారూ పడకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. మార్కెట్ లో దొరికే ఖరీదైన నూనెలను వాడవలసిన అవసరం లేదు.
మిక్సీ జార్ లో రెండు ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల ఆవనూనె, అరకప్పు తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఒక కప్పు శుభ్రంగా కడిగి ఆరబెట్టిన కరివేపాకు వేసి అరకప్పు నీటిని పోసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద ఇనుప కడాయి పెట్టి తయారుచేసుకున్న పేస్ట్ వేయాలి.
ఆ తర్వాత దానిలో వంద గ్రాముల ఆవనూనె, వంద గ్రాముల కొబ్బరి నూనె, వంద గ్రాముల ఆముదం వేసి సిమ్ లో బాగా మరిగించాలి. ఈ నూనెను వడకట్టి సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను జుట్టుకి రాసి పది నిమిషాలు మసాజ్ చేసి గంట తర్వాత రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

