బియ్యం పిండితో కమ్మని పూరీలు.. ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? రుచి అద్భుతంగా ఉంటుంది!
Rice Flour Puri: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వేడి వేడి పూరీ. సాధారణంగా పూరీలను మనం గోధుమ పిండి లేదా మైదాతో తయారు చేస్తుంటాం. కానీ ఎప్పుడైనా బియ్యం పిండితో పూరీలు (Rice Flour Puri) చేసి చూశారా?
బియ్యం పిండితో చేసే పూరీలు నూనె తక్కువ పీల్చుకోవడమే కాకుండా, చాలా మృదువుగా మరియు కమ్మగా ఉంటాయి. రొటీన్ బ్రేక్‌ఫాస్ట్‌లకు భిన్నంగా, సరికొత్త రుచితో ఉండే ఈ బియ్యం పిండి పూరీలను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
చికెన్ కర్రీ, ఆలు కుర్మా లేదా ఏదైనా స్పైసీ గ్రేవీతో ఈ పూరీలను నంజుకుని తింటే ఆ మజాయే వేరు! మరి ఎంతో రుచిగా, బెలూన్‌లా పొంగుతూ వచ్చే ఈ రైస్ ఫ్లోర్ పూరీలను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలి? పిండిని ఎలా కలుపుకోవాలి? అనే పూర్తి వివరాలను ఈ బ్లాగ్ పోస్ట్‌లో వివరంగా తెలుసుకుందాం. ఈ వీకెండ్‌కి మీ ఇంట్లో ఈ కొత్త రకం పూరీలను తప్పక ట్రై చేసి చూడండి!
ఈవినింగ్ స్నాక్స్ కి పిల్లలైనా ,పెద్దవారైనా ఎంతో ఇష్టంగాతినే బియ్యం పిండి స్పెషల్ పూరీలు. కారం కారంగా కరకరలాడే పూరీలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
బియ్యం పిండి – 2 కప్పులు
అల్లం ముక్కలు – 2-3 ఇంచ్ లు
వెల్లుల్లి రెబ్బలు – 7-8
ఉల్లిపాయ -1
పచ్చమిర్చి – 5-6
నెయ్యి – కొద్దిగా
కరివేపాకు – 5-6 రెమ్మలు
జీలకర్ర – 1 టీ స్పూన్
అజోవాన్ – ½ టీ స్పూన్
నువ్వులు – 2 టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
తయారీ విధానం
1.ముందుగా మిక్సి జార్ లోకి అల్లం,వెల్లుల్లి ,ఉల్లిపాయలు,పచ్చిమిర్చి వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
2.ప్యాన్ వేడి చేసి అందులోకి నెయ్యి ,లేదా నూనే వేడి చేసి అందులోకి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని వేసి నిమిషం పాటు వేపుకోవాలి.
3.అందులోకి తరగిన కరివేపాకు,రెండు కప్పుల నీళ్లు ,జీలకర్ర,అజోవాన్,నువ్వులు,టీ స్పూన్ ఉప్పు వేసి నీళ్లను మరిగించాలి.
4.నీళ్లు మరిగాక స్టవ్ లోఫ్లేమ్ లోకి మార్చుకోని అందులోకి బియ్యం పిండిని వేసి కలుపుకోవాలి.
5.స్టవ్ ఆఫ్ చేసి పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
6.ఉడికిన బియ్యం పిండి మిశ్రమాన్ని వేరొక గిన్నెలోకి మార్చుకోవాలి.
7.చల్లారిన పిండిని బాగా కలుపుకోని ప్లాస్టిక్ కవర్ పై పూరీలను వత్తుకోవాలి.
8.డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసి వత్తుకున్న పూరీలను ఫ్రై చేయండి.
9.రెండు వైపుల ఎర్రగా కాల్చుకుంటే బియ్యం పిండి పూరీలు రెడీ.

