Healthhealth tips in telugu

రోజుకు 2 సార్లు ఇది తీసుకుంటే చాలు.. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు మాయం అవ్వడం ఖాయం!

Joint Pains Oil Home Remedies : ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే కనిపించే కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు నేడు మారిన జీవనశైలి, సరైన పోషకాహారం లేకపోవడం వల్ల యువతను కూడా తీవ్రంగా బాధిస్తున్నాయి. ఉదయం లేవగానే పాదాలు నేలమీద మోపాలంటే భయం.. మెట్లు ఎక్కాలంటే మోకాళ్లలో భరించలేని నొప్పి..

ఈ సమస్యలతో మీరు కూడా బాధపడుతున్నారా? అయితే మీకోసం ఒక అద్భుతమైన సహజసిద్ధమైన పరిష్కారం ఉంది. రోజులో కేవలం 2 సార్లు ఈ పద్ధతిని పాటిస్తే కీళ్ల నొప్పులు, నరాల నొప్పులు మాయం అవుతాయి. ఇంతకీ ఆ చిట్కా ఏంటి? దాన్ని ఎలా తయారుచేసుకోవాలో ఈ పోస్ట్‌లో వివరంగా చూద్దాం.

ఈ రోజుల్లో చాలామంది మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధ పడుతున్నారు. ఒకప్పుడు 50 నుంచి 60 ఏళ్ళు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు., కీళ్ల నొప్పులు వంటివి వచ్చేవి. కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో 30 సంవత్సరాల వయసులోనే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి.
Ginger benefits in telugu
ఇలా రావటానికి జీవనశైలి అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, అధిక బరువు వంటి వాటిని కారణాలుగా చెప్పవచ్చు. ఈ రోజు కీళ్లనొప్పులు తగ్గించుకోవడానికి ఒక మంచి రెమిడీ తెలుసుకుందాం. నొప్పులు తగ్గించుకోవడానికి చాలామంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. ఈ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది.అలాగే ఎక్కువ రోజులు వాడితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

పొయ్యి మీద పాన్ పెట్టి 50 Ml ఆవనూనె పోయాలి. కాస్త వేడి అయ్యాక ఒక స్పూన్ మినపప్పు, అంగుళం అల్లం ముక్కను తురిమి వేయాలి. ఆ తర్వాత ఒక కర్పూరం బిళ్ళను పొడిగా చేసి వేయాలి. దాదాపుగా 10 నిమిషాల పాటు మరిగిస్తే మినపప్పు,అల్లం,కర్పూరంలో ఉన్న పోషకాలు నూనెలోకి చేరతాయి.

ఈ నూనెను వడకట్టి గాజు సీసాలో నిల్వ చేసుకుంటే దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ నూనెను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా 5 నిమిషాల పాటు మసాజ్ చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. రోజులో ఉదయం ఒకసారి,సాయంత్రం ఒకసారి నూనెతో మసాజ్ చేస్తే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."