ఏసీ రోజంతా ఆన్ చేసి ఉన్నా కరెంట్ బిల్ తక్కువ రావాలా? అయితే ఈ 5 సీక్రెట్స్ మీకోసమే!
Ac Power saving Tips in telugu:వేసవికాలం ఉక్కపోతకు ఏసీ వేయకుండా ఉండలేము.. అలాగని రోజంతా ఏసీ ఆన్ చేస్తే నెలాఖరులో వచ్చే కరెంట్ బిల్లు చూస్తే గుండె ఆగినంత పని అవుతుంది! ఈ భయంతోనే చాలామంది ఏసీ ఉన్నా వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు.
కానీ, ఏసీ వాడే విధానంలో కొన్ని చిన్న ట్రిక్స్ పాటిస్తే, మీ రూమ్ చల్లదనం ఏమాత్రం తగ్గకుండానే కరెంట్ బిల్లును సగానికి సగం తగ్గించుకోవచ్చు. అసలు ఏసీ టెంపరేచర్ ఎంతలో ఉంచాలి? స్లీప్ మోడ్, టైమర్ ఆప్షన్లను ఎలా వాడాలి? లాంటి ఎవరికీ పెద్దగా తెలియని టాప్ ఏసీ పవర్ సేవింగ్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
వేసవి కాలం ప్రారంభం అయింది. ఎండ కారణంగా చెమటలు పట్టటం కూడా ప్రారంభం అయింది. కామన్ గా ప్రతి ఒక్కరూ Ac వేసుకోవటం ప్రారంభిస్తారు. అయితే Ac ఎక్కువగా వాడితే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. ఈ tips ఫాలో అయితే కరెంట్ బిల్ తక్కువగా వస్తుంది.

ఏసీ ని ఎప్పుడు తక్కువ టెంపరేచర్ వద్ద సెట్ చేయకూడదు. మనలో చాలామంది ఏసీని 16 లేదా 18 డిగ్రీల వద్ద ఉంచితే మంచి కూలింగ్ వస్తుందని ఎక్కువగా అలానే పెడుతూ ఉంటారు. కానీ ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీలు వద్ద ఉంచాలి. అప్పుడు విద్యుత్తు చాలా వరకు ఆదా అవుతుంది.
వేసవి కాలానికి ముందు చలికాలంలో కూడా అప్పుడప్పుడు ఏసీ ఆన్ చేస్తూ ఉండాలి. అలాగే వేసవికాలం ప్రారంభం కాగానే ఒక్కసారి ఏసీ ని సర్వీసింగ్ చేయించి వాడాలి. సర్వీసింగ్ చేయించకపోతే దుమ్ము ధూళి ఉండటం వలన ఏసీ ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. ఏసీ ఎక్కువగా పని చేస్తే కరెంట్ బిల్లు కూడా ఎక్కువగానే వస్తుంది.
ఏసీ ఆన్ చేయటానికి ముందే గది తలుపులు, కిటికీలు మూసేయాలి. అప్పుడు వేడిగాలి గదిలోకి ప్రవేశించదు. అలాగే గదిలోని చల్లని గాలి బయటకు వెళ్ళదు. ఒకవేళ తలుపులు, కిటికీలు సరిగా వేయకపోతే ఏసీ ఎక్కువగా పని చేయాల్సి వచ్చి కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ చిట్కాలను పాటిస్తే కరెంట్ బిల్ తక్కువగా వస్తుంది.

