జిడ్డు పట్టిన గ్యాస్ బర్నర్లను రుద్దే పని లేకుండా… ఒక్క నిమిషంలో కొత్తవాటిలా మెరిపించండిలా!
Gas Burner cleaning tips in telugu: వంటగదిలో మనం ప్రతిరోజూ వాడే గ్యాస్ స్టవ్ బర్నర్లు తరచుగా వంటకాలు పొంగిపడటం, నూనె జిడ్డు వల్ల నల్లగా మారిపోతుంటాయి. దీనివల్ల బర్నర్ రంధ్రాలు మూసుకుపోయి గ్యాస్ కూడా వృధా అవుతుంది.
వీటిని సోప్ పెట్టి గంటల తరబడి రుద్ది క్లీన్ చేయడం చాలా కష్టమైన పని. కానీ, శ్రమ పడకుండా మన వంటగదిలో దొరికే నిమ్మకాయ, బేకింగ్ సోడా, వెనిగర్ వంటి వాటిని ఉపయోగించి నిమిషంలోనే గ్యాస్ బర్నర్లను ఎలా క్లీన్ చేయవచ్చో, గ్యాస్ ఆదా చేసుకునే ఆ స్మార్ట్ కిచెన్ టిప్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం!
వంటింటిలో ఎక్కువగా వస్తువులు జిడ్డు పట్టేస్తూ ఉంటాయి. ముఖ్యంగా గ్యాస్ స్టవ్ బర్నర్స్ మురికి, జిడ్డు పట్టి నల్లగా మారిపోతూ ఉంటాయి. వాటిని శుభ్రం చేయటం కాస్త కష్టమైన పనే…అయినా ఇప్పుడు చెప్పే చిట్కాను ఫాలో అయితే చాలా సులభంగా క్లిన్ చేసుకోవచ్చు.
ఒక కప్పులో బర్నర్స్ వేసి మునిగే దాక వెనిగర్ పోయాలి. దానిలో అరస్పూన్ బేకింగ్ సోడా వేసి రాత్రంతా ఆలా ఉంచేసి మరుసటి ఉదయం బర్నర్స్ ని బ్రష్ సాయంతో శుభ్రం చేస్తే మురికి అంతా తొలగిపోయి కొత్తవాటిల్లా మెరుస్తాయి. ఇలా 15 రోజులకు ఒకసారి చేస్తూ ఉంటే సరిపోతుంది.
Eno ని ఉపయోగించి కూడా గ్యాస్ బర్నర్‌ను శుభ్రం చేయొచ్చు. ముందుగా ఒక గిన్నెలో వేడి నీళ్లు తీసుకోవాలి. అందులో ఒక నిమ్మకాయ రసం, ఒక Eno పాకెట్ లో పౌడర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో గ్యాస్ బర్నర్స్ వేసి అరగంట తర్వాత శుభ్రం చేస్తే నల్లగా మారిన గ్యాస్ బర్నర్స్ తెల్లగా మెరుస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
Gas burner cleaning tips in Telugu, How to clean gas stove burners, Kitchen tips Telugu, గ్యాస్ బర్నర్ క్లీనింగ్ చిట్కాలు, Cleaning hacks in Telugu, Smart kitchen ideas, Home making tips.

