Healthhealth tips in telugu

రోజూ జీలకర్ర, బెల్లం కలిపి తింటే మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే!

Cumin seeds and jaggery water benefits : మన వంటగదిలో సులభంగా దొరికే జీలకర్ర, బెల్లం కేవలం వంటల రుచిని పెంచడానికే కాకుండా, మన ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తాయి.

ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రక్తహీనత (Anemia) తగ్గుతుంది మరియు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని మలినాలను బయటకు పంపి, నెలసరి నొప్పుల నుండి ఉపశమనం అందించే ఈ సహజసిద్ధమైన చిట్కా మన శరీరంలో ఇంకెన్ని మార్పులు తెస్తుందో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం

జీలకర్ర, బెల్లం రెండింటిలోను ఎన్నో పోషకాలు,ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి ఒక స్పూన్ జీలకర్ర వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ఆర్గానిక్ బెల్లం వేసి ఒక నిమిషం మరిగించి వడకట్టి తాగాలి.
cumin seeds
జీలకర్ర మరియు బెల్లంలో పొటాషియం సమృద్దిగా ఉండుట వలన కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలను తటస్తం చేయడంలో సహాయపడి గ్యాస్, అజీర్ణం,అసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణశక్తి పెరిగేలా చేస్తుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు భోజనం చేసిన తర్వాత తీసుకుంటే మంచి ప్రయోజనం కనపడుతుంది. బరువును తగ్గించటంలో కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. అనేక రకాల కారణాలతో రక్తంలో అనేక రకాల మలినాలు మరియు టాక్సిన్స్ పేరుకుపోయి అనేక రకాల వ్యాధులకు కారణం కావచ్చు. బెల్లం మరియు జీలకర్రలోని ఖనిజాలు రక్తప్రవాహంలో ఉన్న టాక్సిన్స్‌ను బయటకు పంపి, సహజంగా రక్తాన్ని శుద్ధి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

జీలకర్ర మరియు బెల్లంలో మెగ్నీషియం మరియు పొటాషియం సమృద్దిగా ఉండుట వలన శరీరంలోని ప్రతి కణాన్ని బలోపేతం చేస్తుంది. అలాగే వ్యాధిని కలిగించే కారకాల మీద పోరాటం చేసి, శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారిలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి.

రక్తపోటును నియంత్రణలో ఉంచి రక్తప్రసరణ బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జీలకర్ర మరియు బెల్లం రెండింటిలో ఉండే పొటాషియం మరియు ఇతర ఖనిజాలు వాపు మరియు నొప్పిని తగ్గించడానికి కీళ్లకు రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. దాంతో నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఉదయం సమయంలో తాగితే రోజంతా హుషారుగా ఉంటారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."