పప్పులు నానబెట్టే పనిలేకుండా.. 10 నిమిషాల్లో అప్పటికప్పుడు వేసుకునే ‘క్రిస్పీ గోధుమ పిండి దోశ’!
Crispy Wheat Flour Dosa :క్రిస్పి గోధుమ పిండి దోశ.. దోశ అనగానే ముందురోజునుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. పప్పు నానబెట్టడం,పిండి రుబ్బుకోవడం ఇలా హడావిడి లేకుండా,టైం లేనప్పుడు ఇన్ స్టంట్ గా గోధుమ పిండితో క్రిస్పి దోశలు చేసి చూడండి.
ఉదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్ ఏం చేయాలో తోచట్లేదా? దోశలు వేయాలని ఉన్నా.. మినపప్పు నానబెట్టి, పిండి రుబ్బే సమయం లేదా? అయితే ఎలాంటి టెన్షన్ లేకుండా అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాల్లో వేడివేడిగా ‘గోధుమ పిండి దోశ’ (Wheat Flour Dosa) వేసుకోండి.
చాలామంది గోధుమ పిండితో దోశలు వేస్తే మెత్తగా వస్తాయని, అతుక్కుపోతాయని అనుకుంటారు. కానీ కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే హోటల్ లో దొరికే దోశల కంటే ఇవి చాలా క్రిస్పీగా, ఎంతో రుచిగా వస్తాయి.

కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ లేదా టమాటా పచ్చడితో ఈ కరకరలాడే దోశలు తింటుంటే ఆ మజాయే వేరు. తక్కువ సమయంలోనే, అందరికీ నచ్చే ఈ ఇన్ స్టంట్ అండ్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రెసిపీని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్ధాలు
గోధుమ పిండి – 1 కప్పు
బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్
పెరుగు – ½ కప్పు
పెప్పర్ పౌడర్ – ½ టీ స్పూన్
ఉప్పు – ½ టీ స్పూన్
వంట సోడా – కొద్దిగా
తయారీ విధానం
1.ముందుగా మిక్సింగ్ బౌల్ లోకి గోధుమ పిండి,బియ్యం పిండి ,ఉప్పు,మిరియాల పొడి ,బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి.
2.1/2 కప్పు పెరుగుకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి దోశపిండిలో కలుపుకోని పిండిని దోశ బ్యాటర్ లా సిధ్దం చేసుకోవాలి.
3.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని దోశ పెనాన్ని వేడెక్కనివ్వాలి.
4.గరిటడు పిండిని ప్యాన్ పై వేసుకోని నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి.
5.వేసుకున్న దోశ అంచులపై కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి.
6.దోశను రెండు వైపుల ఎర్రగా కాల్చుకుంటే కరకర లాడే గోధుమ పిండి దోశ రెడీ.

