Beauty TipsHealthhealth tips in telugu

జుట్టు విపరీతంగా రాలిపోతోందా? కంగారు వద్దు.. ఈ సింపుల్ ఇంటి చిట్కాలతో చెక్ పెట్టండి!

Hair Fall Control tips in telugu : జుట్టు రాలడం (Hair Fall) అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న పెద్ద సమస్య. పోషకాహార లోపం, ఒత్తిడి, కాలుష్యం వల్ల రాలిపోతున్న జుట్టును కాపాడుకోవడం ఎలా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతో జుట్టు రాలడాన్ని అరికట్టి, ఒత్తుగా మరియు బలంగా ఎలా మార్చుకోవాలో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకోండి.

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే జుట్టు రాలే సమస్య ప్రారంభం అవుతుంది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే చాలా మంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
Green Tea Brain Health Benefits
కాబట్టి జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. దీని కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి స్పూనున్నర టీ పొడి వేసి బాగా మరిగించి డికాషన్ వడగొట్టాలి. టీ డికాషన్ జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.

మరిగిన టీ డికాషన్ ని ఒక బౌల్లో వడకట్టి దానిలో మనం రెగ్యులర్ గా వాడే షాంపూ కలపాలి. ఆ తర్వాత అరచెక్క నిమ్మరసం కలపాలి. నిమ్మలో ఉన్న గుణాలు తలలో చుండ్రు సమస్య తగ్గించడమే కాకుండా తల మీద చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. తలలో చుండ్రు ఎక్కువగా ఉంటే అది జుట్టురాలే సమస్యకు కారణం అవుతుంది.

Tea డికాషన్లో షాంపూ,నిమ్మరసం రసం వేసి బాగా కలిపిన ఈ నీటితో వారంలో రెండు సార్లు తల స్నానం చేయాలి. ఈ విధంగా రెండు నెలలపాటు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గి జుట్టు ఒత్తుగా బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."