Healthhealth tips in telugu

ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు.. జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్స్ మీ దరిదాపుల్లోకి రావు!

Monsoon Health Drink : వర్షాకాలం ప్రారంభం అయింది. వానలు విపరీతంగా కురుస్తున్నాయి. సీజన్ మారినప్పుడు వాతావరణంలో వచ్చే మార్పులు మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ సీజన్లో వచ్చే సమస్యలను తగ్గించుకోవడానికి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకరకంగా చెప్పాలంటే ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి.

వాతావరణం మారగానే జలుబు, దగ్గు, ఫ్లూ, మరియు వైరల్ ఫీవర్స్ ఇబ్బంది పెడుతున్నాయా? అయితే రోగనిరోధక శక్తిని పెంచే ఈ సహజసిద్ధమైన జ్యూస్ మీకోసమే. సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టే ఈ అద్భుతమైన జ్యూస్‌ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి? ఇది తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకోండి.
Carrot
ఈ సీజన్ లో వెజిటేబుల్ జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. వెజిటేబుల్ జ్యూస్ ఎలా తయారుచేయాలో చూద్దాం. ఒక బీట్రూట్ ,ఒక కీరదోస, ఒక క్యారెట్ తీసుకుని పై తొక్క తీసేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటా తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఒక మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టిన ఈ ముక్కలు అన్నింటినీ వేయాలి. ఆ తర్వాత అరచెక్క నిమ్మరసం, ఒక గ్లాసు నీటిని వేసి మిక్సీ చేస్తే వెజిటేబుల్ జ్యూస్ రెడీ అయినట్టే. వారంలో రెండుసార్లు తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అయి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది.

అంతే కాకుండా సీజన్ మారినప్పుడు సాదరణంగా వచ్చే జ‌లుబు, ద‌గ్గు, ఫ్లూ, వైర‌ల్ ఫీవ‌ర్స్ వంటి వాటిని రాకుండా కాపాడుతుంది. అలాగే ఈ సీజన్ లో వచ్చే జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేయటంలో ఈ జ్యూస్ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుండి బయట పడటానికి ఈ జ్యూస్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు. రక్తహీనత సమస్య ఉన్నవారు రోజు విడిచి రోజు తాగితే మంచి ఫలితం కనపడుతుంది. ఒక విషయాన్ని తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. గ్యాస్ సమస్య ఉన్నవారు ఈ జ్యూస్ ని పరగడుపున తాగకూడదు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."