Healthhealth tips in telugu

ఈ పండులో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే వదిలిపెట్టరు!

Ramphal Benefits In Telugu : మనలో చాలా మందికి సీతాఫలం గురించి తెలుసు. కానీ రామాఫలం గురించి పెద్దగా చాలా మందికి తెలియదు. హృదయాకారంలో, లేత ఎరుగు రంగులోను, ఆకు పచ్చ రంగులో ఉండే రామాఫలం సీతాఫల జాతికి చెందినది. పోషక విలువలు సమృద్ధిగా ఉన్న ఈ పండు చాలా రుచిగా ఉంటుంది. రామాఫలంను నెట్టెడ్‌ కస్టర్డ్‌ యాపిల్‌, బుల్లక్‌ హార్ట్‌, బుల్‌ హార్ట్‌ అని కూడా పిలుస్తారు.

సీతాఫలం గురించి మనందరికీ తెలుసు, కానీ దానికి ఏమాత్రం తీసిపోని ‘రామఫలం’ (Ramphal) గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి, ఎన్నో వ్యాధులను దూరం చేసే రామఫలం తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఈ పండులోని సీక్రెట్స్ ఏంటో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకోండి.

సీతాఫలంతో పోలిస్తే రామాఫలంలో గింజలు తక్కువగాను,గుజ్జు ఎక్కువగాను ఉంటుంది. ఒక పండు తింటే అలసిన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అందువల్ల పశ్చిమదేశాల్లో క్రీడాకారులు జ్యూస్‌గా చేసి తాగుతుంటారట. రామాఫలంలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ల శాతం ఎక్కువ. సి- విటమిన్‌తో పాటు బి-కాంప్లెక్స్‌లోని పైరిడాక్సిన్‌ ఇందులో సమృద్ధిగా ఉంటుంది.

ఈ పైరిడాక్సిన్‌ మెదడు కణాలకు అవసరమైన రసాయనాల్ని స్థిరంగా ఉంచేందుకు దోహదపడుతుంది. నరాల వ్యాధులు, తలనొప్పి వంటివి రాకుండా కాపాడేందుకు తోడ్పడుతుంది. రామాఫలంలో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఫ్రీ రాడికల్స్ బారి నుండి శరీరాన్ని కాపాడుతుంది. గుండెకు సంబంధింత సమస్యలను తగ్గిస్తుంది.

రామాఫలంలో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన అధిక కొలెస్ట్రాల్ మరియు అధిక రక్తపోటును తగ్గించటంలో సహాయాపడుతుంది. ఈ పండులో విటమిన్ B6 సమృద్ధిగా ఉండుట వలన రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా చేస్తుంది. దాంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అలాగే విటమిన్ B6 కిడ్నీలో రాళ్లను నిరోధిస్తుంది.

రామాఫలంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండుట వలన హేమోగ్లోబిన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. అలాగే శరీరంలో వివిధ కణాలకు ఆక్సిజన్ రవాణాకు సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి రామాఫలం దివ్య ఔషధం అని చెప్పవచ్చు. రక్తహీనతతో బాధపడేవారు రామాఫలం తింటే చాలా మంచిది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."