షాపుల చుట్టూ తిరగక్కర్లేదు.. ఇంట్లోనే బంగారు నగలను కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్ టిప్స్!
Gold Cleaning tips in telugu:రోజూ వాడటం వల్ల లేదా లాకర్లలో ఎక్కువ కాలం ఉంచడం వల్ల దుమ్ము, చెమట, బాడీ లోషన్లు, సబ్బుల ప్రభావంతో బంగారు నగలు తమ సహజ మెరుపును కోల్పోయి కాంతివిహీనంగా మారుతుంటాయి.
అయితే, వాటిని తిరిగి మెరిపించడానికి ప్రతిసారీ నగల షాపుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. పైగా బయట కెమికల్స్ వాడి పాలిష్ చేయిస్తే బంగారం బరువు తగ్గే ప్రమాదం కూడా ఉంటుంది.
ఇంట్లో నిత్యం అందుబాటులో ఉండే సురక్షితమైన పదార్థాలతో కేవలం 5 నుండి 10 నిమిషాల్లో ఎలాంటి గీతలు పడకుండా, నగలు పాడవకుండా సరికొత్త వాటిలా ఎలా మెరిపించవచ్చో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. రాబోయే పండుగలు, శుభకార్యాల వేళ మీ ఆభరణాలు ధగధగలాడేలా మెరిపించడానికి ఈ సులభమైన హోమ్ రెమెడీస్ ఎంతో బాగా ఉపయోగపడతాయి!

నల్లగా మారిన బంగారు నగలను ఇంటిలోనే చాలా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. బంగారం నగలను ప్రతి రోజు పెట్టుకుంటే నల్లగా మారుతూ ఉంటాయి. వాటిని కొత్తవాటిలా మెరిసేలా చేయాలంటే ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.
బంగారం అంటే ప్రతి ఒక్కరికి మోజు ఉంటుంది. ముఖ్యంగా ఆడవారు అయితే పండగ వచ్చినా పేరంటం వచ్చినా తప్పనిసరిగా బంగారు నగలను ధరిస్తారు. నగలను పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల్లో ధరించాక మిగిలిన సమయంలో వాటిని బీరువాలోనే పెడుతుంటాం.
ఈ నగలు కొన్ని రోజులకు నల్లగా, మురికిగా మారుతూ ఉంటాయి. నల్లగా మారిన నగలు కొత్తవాటిలా మెరవాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. నగలను మెరిపించటానికి టూత్‌పేస్ట్‌ను వాడవచ్చు. అయితే తెల్లని టూత్‌పేస్ట్‌ను వాడాలి. నీటిలో టూత్‌పేస్ట్‌ను కలిపి నగలను పది నిమిషాలు ఉంచి రుద్దితే సరిపోతుంది.
నీటిలో బేకింగ్ సోడా కలిపి నగలకు రాసి రుద్ది రెండు నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తరువాత, వైట్ వెనిగర్ సహాయంతో, నగలపై పేస్ట్ ను శుభ్రం చేయాలి. ఆ తర్వాత నగలను శుభ్రమైన నీటితో ఒకసారి కడగాలి.
నగలు కొత్తవాటిలా మెరవటానికి డిష్ సోప్ ను కూడా ఉపయోగించవచ్చు. గోరువెచ్చని నీటిలో డిష్ సోప్ ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో నగలను వేసి ఒక నిమిషం అయ్యాక బ్రష్ సాయంతో రుద్ది శుభ్రమైన నీటితో కడగాలి. ఆ తర్వాత మృదువైన కాటన్ గుడ్డతో నగలను శుభ్రం చేస్తే సరిపోతుంది.
నగలను శుభ్రం చేయటానికి నిమ్మరసంను కూడా ఉపయోగించవచ్చు. ఒక బౌల్ లో గోరువెచ్చని నీటిని పోసి అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలిపి నగలను వేసి పావుగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత నగలను మృదువైన బ్రష్‌తో స్క్రబ్ చేసి, శుభ్రమైన నీటితో శుభ్రం చేసి ఆరబెట్టాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

