Healthhealth tips in telugu

రోజుకు ఈ ఒక్క పండు తింటే చాలు.. చెడు కొలెస్ట్రాల్‌ మాయం, గుండె పదిలం!

Pears Health benefits In telugu : మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవే సైలెంట్‌గా గుండె జబ్బులకు దారి తీస్తాయి.

అయితే, ప్రతిరోజూ ఒక పండును మన డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యలన్నింటికీ సహజంగానే చెక్ పెట్టవచ్చు. గుండెను రక్షించే ఆ పండు ఏంటి? అందులోని పోషకాలు కొలెస్ట్రాల్‌ను ఎలా కరిగిస్తాయో ఇక్కడ వివరంగా చదవండి.

పియర్స్ ఈ సీజన్ లో ఎక్కువగా లభ్యమవుతాయి. ప్రతి రోజు ఒక పియర్ పండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు, అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్, గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా కాపాడుతుంది. .
Pear Fruits Benefits In telugu
అలాగే ఈ పండ్లలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. పియర్ పండులో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఫైబర్, పోలేట్, పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. పియర్స్ లో పెక్టిన్ అనే కాంపౌండ్ సమృద్ధిగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించి అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఈ పండులో ఉండే పొటాషియం రక్త ప్రవాహం బాగా సాగి రక్తపోటు నియంత్రణలో ఉండి గుండెకి ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ పండు డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. దీనిలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. .

అలాగే జీర్ణ సంబంద సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు కూడా రోజుకి ఒక పండు తింటే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు. రక్తం తక్కువగా ఉన్నావారు, బలహీనంగా, నీరసంగా ఉండేవారు ఈ పండ్లను తింటే మంచిది. వీటిలోని ఐరన్, కాపర్‌ శరీరానికి బలాన్ని ఇస్తాయి. ఎర్రరక్త కణాల సంఖ్యను పెంచుతాయి.

రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ఈ పండులో రాగి, కాల్షియం, పాస్పరస్, మాంగనీస్, మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలు బలహీనంగా మారకుండా బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ప్రతి రోజు ఒక పియర్ పండును తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ప్రస్తుతం ఈ పండ్లు చాలా విరివిగా లభ్యం అవుతున్నాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."