కేవలం 5 నిమిషాల్లో మీ ముఖం ప్రకాశవంతంగా మారాలా? ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి!
Face Glow Tips:ముఖం ఎప్పుడూ కాంతివంతంగా, మచ్చల్లేకుండా మెరిసిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ కాలుష్యం, ఎండ ప్రభావం, ఒత్తిడి వల్ల చర్మం తన సహజ కాంతిని కోల్పోయి నిర్జీవంగా, నల్లగా మారుతుంది. అప్పటికప్పుడు ఏదైనా ఫంక్షన్ లేదా పార్టీకి వెళ్లాల్సి వచ్చినప్పుడు, ముఖం డల్‌గా ఉంటే పార్లర్‌కు వెళ్లే సమయం కూడా ఉండదు.
అలాంటి పరిస్థితుల్లో వేలకు వేలు ఖర్చు చేయకుండా, కేవలం మన వంటగదిలో ఉండే సహజమైన వస్తువులతోనే ఐదు నిమిషాల్లో ముఖాన్ని ఎంతో ప్రకాశవంతంగా ఎలా మార్చుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ ఇన్స్టంట్ గ్లోయింగ్ చిట్కాతో మీ చర్మం ఎంత మృదువుగా, కాంతివంతంగా మారుతుందో మీరే చూసి ఆశ్చర్యపోతారు. దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలా చేస్తే ఎంతటి నల్లని ముఖం అయినా 5 నిమిషాల్లో తెల్లగా మారుతుంది..ముఖం తెల్లగా అందంగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇక ఈ వేసవిలో అయితే ముఖం మీద చెమట,దుమ్ము,ధూళి వంటివి చేరి ముఖం నల్లగా మారుతుంది. ఇప్పుడు చెప్పే ప్యాక్ వేసుకుంటే ముఖం మీద మలినాలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ బియ్యం పిండి, అరస్పూన్ కాఫీ పొడి,అరస్పూన్ పంచదార,ఒక స్పూన్ బాదం నూనె లేదా ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.
కాఫీ పొడి మృత కణాలను తొలగిస్తుంది. బియ్యం పిండి మంచి ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది. పంచదార నిస్తేజంగా మారిన చర్మంలో తాజాదనాన్ని నింపుతుంది. ఆలివ్ నూనె లేదా బాదం నూనె చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ఈ ప్యాక్ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

