Beauty TipsHealthhealth tips in telugu

చిన్న వయసులో వచ్చే తెల్లజుట్టును శాశ్వతంగా నల్లగా మార్చే అద్భుతమైన ఇంటి వైద్యం!

White Hair Turn Black:చిన్న వయసులోనే తెల్ల జుట్టు (Premature Graying) రావడం అనేది ఈ రోజుల్లో చాలా మందిని మానసికంగా కుంగదీస్తున్న అతి పెద్ద సమస్య. దీన్ని కవర్ చేయడానికి మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన హెయిర్ డైలు (Hair Dyes), కలర్స్ వాడటం వల్ల తాత్కాలికంగా జుట్టు నల్లగా మారినా, భవిష్యత్తులో జుట్టు ఎక్కువగా రాలిపోయి, ఉన్న జుట్టు అంతా పూర్తిగా తెల్లగా మారిపోతుంది.

మరి ఎలాంటి కెమికల్స్ వాడకుండా, న్యాచురల్ పద్ధతిలో తెల్ల జుట్టును నల్లగా ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ అద్భుతమైన ఇంటి చిట్కా మీకోసమే! కేవలం మన ఇంట్లో ఉండే సహజమైన వస్తువులతో తయారుచేసుకునే ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాస్తే చాలు..

తెల్ల జుట్టు కుదుళ్ల నుంచి సహజంగా నల్లగా మారడమే కాకుండా మళ్లీ మళ్లీ తెల్లబడకుండా ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆ మ్యాజికల్ హెయిర్ ప్యాక్ ఏమిటి? దాన్ని ఎలా తయారుచేసుకుని వాడాలో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.

దీన్ని ఒక్కసారి జుట్టుకి రాస్తే జుట్టు నల్లబడుతుంది …మళ్ళీ మళ్ళీ తెల్లబడదు.. ఈ మధ్య కాలంలో జుట్టుకి సంబందించిన సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా తెల్లజుట్టు సమస్య,జుట్టు రాలే సమస్య వంటివి ఎక్కువగా వస్తున్నాయి. ఈ సమస్యలు తగ్గాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటూ ఇప్పుడు చెప్పే నూనెను వారంలో రెండు సార్లు రాస్తే మంచి ఫలితం వస్తుంది.

ఈ చిట్కా కోసం మిక్సీ జార్ లో ఒక స్పూన్ కలోంజీ గింజలు, ఒక స్పూన్ మెంతులను వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టి ఆవనూనె పోసి కాస్త వేడి అయ్యాక మిక్సీ చేసుకున్న పొడిని వేసి బాగా కలపాలి. మూడు నిమిషాలు అయ్యాక స్పూనున్నర హెన్నా పొడిని వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమం నలుపు రంగు వచ్చేవరకు పొయ్యి మీద ఉంచాలి. ఆ తర్వాత కాస్త చల్లారాక వడకట్టి ఉంచుకోవాలి. అరగంట అయ్యాక ఈ నూనెను జుట్టు మొదళ్లు నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి. ఇలా పట్టించాక ఒక గంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేయాలి.

ఈ విధంగా చేయటం వలన తెల్లజుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య వంటి జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."