Healthhealth tips in telugu

హైబీపీతో బాధపడుతున్నారా? ఈ పండ్లు తింటే జీవితంలో రక్తపోటు అదుపులో ఉంటుంది!

Best Fruits to Lower Blood Pressure : హైబీపీ లేదా అధిక రక్తపోటుతో బాధపడేవారు ఏ పండ్లను తింటే రక్తపోటు ఎప్పటికీ అదుపులో ఉంటుందో తెలుసా? బీపీని నియంత్రించి, గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆ అద్భుతమైన పండ్ల పూర్తి వివరాల కోసం ఇప్పుడే చదవండి!

ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితులు, వ్యాయామం చేయకపోవటం వంటి అనేక రకాల కారణాలతో రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. రక్తపోటు సమస్య ఉన్నప్పుడు జీవితకాలం మందులు వాడుతూ ఖచ్చితంగా అరగంట వ్యాయామం చేస్తూ రక్తపోటును నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి.

అధిక రక్తపోటు ఉన్నవారు ఆహారం మరియు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా అధిక రక్తపోటును నియంత్రించవచ్చు.కొవ్వు పదార్ధాలు, ఉప్పు మరియు చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని తగ్గించడం మంచిది. కొన్ని పండ్లను తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం.

విటమిన్ సి మరియు పొటాషియం సమృద్దిగా ఉండే కమలా పండును తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కమలా పండును తొనలుగా తినవచ్చు…లేదంటే జ్యూస్ చేసుకొని తాగవచ్చు. అలాగే నిమ్మకాయ మరియు ద్రాక్షపండులో కూడా యాంటీ ఆక్సిడెంట్ మరియు విటమిన్ సి సమృద్దిగా ఉంటాయి. ఇవి కూడా బీపీ సమస్యను నయం చేస్తాయి.

జామ పండులో విటమిన్ సి మరియు పొటాషియం సమృద్దిగా ఉంటాయి. జామ పండును తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. జామ కాయను పేద వాని Apple అని అంటారు. జామలో కెరోటినాయిడ్లు మరియు పాలీఫెనాల్స్ రూపంలో అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి గుండెను ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి రక్షిస్తాయి.

టమోటాను మనం కూర,పప్పు ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తాం. టమోటాలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. రక్తపోటు సమస్య ఉన్నవారు దీన్ని యథాతథంగా తీసుకోవచ్చు, లేకుంటే జ్యూస్‌ చేసి కూడా తాగవచ్చు. టమోటా రసాన్ని సూప్‌లలో కూడా ఉపయోగించవచ్చు. కానీ టమోటాతో ఏదైనా ఆహారాన్ని తయారుచేసేటప్పుడు ఉప్పును వాడకుండా ఉంటే మంచిది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."