Beauty TipsHealthhealth tips in telugu

బియ్యంతో ఇలా చేస్తే పల్చటి జుట్టు కూడా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది!

Rice Water and vitamin E hair Fall Tips : ఎంత పల్చగా ఉన్న జుట్టు అయినా సరే, బియ్యంతో ఈ సింపుల్ చిట్కా పాటిస్తే ఒత్తుగా మరియు పొడవుగా పెరుగుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి, కుదుళ్లను బలోపేతం చేసే ఈ అద్భుతమైన ఇంటి వైద్యం పూర్తి వివరాల కోసం ఇప్పుడే చదవండి!

ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య ఎక్కువ అయింది. మనలో చాలా మంది జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. .

అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని పదార్థాలను ఉపయోగించి జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు చెప్పే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా రాలిన ప్రదేశంలో జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. దీని కోసం ఇప్పుడు చెప్పే రెమిడీ ఫాలో అయితే సరిపోతుంది. .

ఒక బౌల్లో మూడు స్పూన్ల బియ్యం వేసి నీటిని పోసి శుభ్రంగా కడగాలి. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి నీరు కొంచెం వేడెక్కాక కడిగి పెట్టుకున్న బియ్యం, గుప్పెడు ఎర్ర మందార పువ్వు రేకలు లేదా ఒక స్పూన్ మందార పువ్వుల పొడి వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.

ఈ నీటిని ఒక బౌల్ లోకి వడగట్టి చల్లారనివ్వాలి. ఈ నీరు చల్లారాక ఒక స్పూన్ ఆముదము, రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ లోని ఆయిల్ వేసి బాగా కలపాలి. జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట అయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.

ఈ రెమెడీని ఫాలో అయితే చాలా మంచి ఫలితాన్ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పొందవచ్చు. ఈ రెమిడీలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ సులభంగానే అందుబాటులో ఉంటాయి. చాలా తక్కువ ఖర్చులో ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచిది. తాజా మందార పువ్వులు లేకపోతే మందార పువ్వుల పొడిని వాడవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."