సర్వ రోగ నివారిణి ‘ఉసిరి’.. ఉదయం ఒక గ్లాసు ఈ రసం తాగితే డాక్టర్ తో పనే ఉండదు!
Amla Juice Health benefits in telugu : ఉసిరి.. దీనిని ఆయుర్వేదంలో సాక్షాత్తూ అమృతంతో పోలుస్తారు. వాతావరణం మారినప్పుడల్లా వచ్చే జబ్బులను తట్టుకోవాలన్నా, రోగనిరోధక శక్తిని అమాంతం పెంచుకోవాలన్నా ఉసిరిని మించిన దివ్యౌషధం లేదు. ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఉసిరి రసం (Amla Juice) కలుపుకుని తాగడం వల్ల మన శరీరానికి ఊహించని ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని మలినాలను బయటకు పంపి (Detoxification), బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు, జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడానికి, చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా మెరిసిపోవడానికి, అలాగే మధుమేహం (షుగర్ లెవెల్స్) అదుపులో ఉండటానికి ఈ ఉసిరి రసం ఎంతగానో సహాయపడుతుంది.
అసలు పరగడుపున ఉసిరి రసం ఎలా తాగాలి? అందులో తేనె కలుపుకోవచ్చా? ఎవరు ఈ రసం తాగకూడదు? తదితర పూర్తి వివరాలను ఈ బ్లాగ్ పోస్ట్‌లో వివరంగా తెలుసుకుందాం. మీ ఆరోగ్యాన్ని సహజంగా కాపాడుకునే ఈ సింపుల్ చిట్కాను అస్సలు మిస్ అవ్వకండి!
ఉసిరిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉసిరికి ఆయుర్వేదంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. పుల్లని రుచితో ఉండే ఉసిరిలో విటమిన్ సి సమృద్దిగా ఉండటమే కాకుండా పోషకాల భాండాగారం అని చెప్పవచ్చు. కొంతమంది పచ్చిగా తినడానికి ఇష్టపడతారు…కొంతమంది జ్యూస్ తాగటానికి ఇష్టపడతారు.

విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ గా వచ్చే జలుబు,దగ్గు,గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ వంటివి రాకుండా కాపాడుతుంది. జీర్ణ ప్రక్రియలో సహాయపడుతుంది. ఉసిరిలో కెరోటిన్ ఉండుట వలన కంటి చూపు బాగుండేలా చేయటమే కాకుండా కంటి శుక్లం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది.
చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. థైరాయిడ్ గ్రంధిని నియంత్రించడంలో సహాయపడుతుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది. ఉసిరిలో యాంటీ ఏజింగ్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఎమెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి.
డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఉసిరికాయ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను పెంచుతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఉసిరిలో ఉండే క్రోమియం చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఉదయం పరగడుపున తాగటం వలన అలసట,నీరసం లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు.
రెండు ఉసిరి కాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి ఒక కప్పు నీటిని పోసి బాగా మిక్సీ చేయాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి తేనె కలిపి తాగవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి. సీజన్ లో అయితే తాజా ఉసిరికాయలతో జ్యూస్ తయారుచేసుకోవచ్చు. సీజన్ కానప్పుడు ఉసిరి పొడిని ఉపయోగించవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

