ఆపిల్ పండు తిన్న తర్వాత నీళ్లు తాగడం మంచిదేనా? డాక్టర్లు ఏమంటున్నారో తెలుసా?
Apple benefits In Telugu : రోజుకో ఆపిల్ తింటే డాక్టర్‌కు దూరంగా ఉండొచ్చు’ అనేది మనందరికీ తెలిసిన పాత నానుడే. ఆపిల్ పండులో విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, చాలామంది ఆపిల్ తిన్న వెంటనే గటగటా నీళ్లు తాగేస్తుంటారు.
కానీ, ఇలా చేయడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆపిల్ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల కడుపులోని జీర్ణ రసాలు (Digestive acids) పలుచబడి జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అసలు ఆపిల్ తిన్న తర్వాత నీళ్లు ఎందుకు తాగకూడదు?
కడుపులో జరిగే ఆ మార్పులు ఏంటి? పండ్లు తిన్న తర్వాత ఎంత సమయం ఆగి నీళ్లు తాగడం సురక్షితం? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలను ఈ బ్లాగ్ పోస్ట్‌లో వివరంగా తెలుసుకుందాం. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ చిన్న తప్పును వెంటనే సరిదిద్దుకోండి!
ఆపిల్ లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని అంటూ ఉంటారు. అయితే ఆపిల్ తిన్న వెంటనే కొన్ని ఆహారాలను తీసుకోకూడదు…నీటిని తాగకూడదు. అలా చేస్తే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.

ఏదైనా తీపి,పులుపు పండు తిన్నాక నీటిని తాగటం మంచిది కాదని నిపుణులు చెప్పుతున్నారు.ఒకవేళ నీటిని తాగితే శరీరంలోని pH స్థాయిని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల అజీర్ణం, మలబద్ధకం, పొట్టలో బ్యాక్టీరియా సమస్యలు, అధిక గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. ఆపిల్ తిన్న తర్వాత నీటిని తాగడం వల్ల పొట్టలోని జీర్ణ రసాలు చల్లబడి ఈస్ట్ వృద్ధి చెందుతుంది. ఇది పొట్టలో గ్యాస్ట్రిక్ మరియు ఉబ్బరం సమస్యలకు దారితీస్తుంది.
మనం తినే వివిధ రకాల ఆహార పదార్థాలు మన శరీరంపై వివిధ ప్రభావాలను చూపుతాయి. కొన్ని ఆహార పదార్ధాలతో కొన్ని ఆహారాలను కలిపి తినకూడదు. ఆపిల్ తిన్న రెండు గంటల వరకు పెరుగు తినకూడదు. ఆపిల్ పండు తిన్న తర్వాత పెరుగు తినడం వల్ల ఛాతీలో కఫం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది.
ఆపిల్ తిన్న రెండు గంటల వరకు అవకాయలు ముఖ్యంగా నిమ్మ ఆవకాయ తినకూడదు. నిమ్మ ఆవకాయలో పులుపు ఎక్కువగా ఉంటుంది. దాంతో మలబద్ధకం సమస్యతో పాటు ఎసిడిటీ మరియు గ్యాస్ సమస్య వస్తుంది. కాబట్టి ఆపిల్ తిన్న వెంటనే అవకాయలకు దూరంగా ఉంటేనే మంచిది.
ఆపిల్ తిన్న వెంటనే ముల్లంగి తింటే చర్మ సమస్యలు వస్తాయి. చర్మంపై దద్దుర్లు మరియు అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆపిల్ తిన్న వెంటనే నీటిని తాగకుండా మరియు ఇప్పుడు చెప్పిన ఆహారాలను తినకుండా జాగ్రత్తగా ఉండాలి. రెండు గంటల తర్వాత నీటిని తాగవచ్చు…ఈ ఆహారాలను తినవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

