Healthhealth tips in telugu

డైటింగ్, జిమ్ లేకుండానే వేగంగా బరువు తగ్గే అద్భుతమైన ఇంటి చిట్కా.. ఈ పొడి ఎలా తయారుచేయాలో తెలుసా?

Best weight Loss Drink : మారుతున్న జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల నేడు చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ‘అధిక బరువు’. బరువు తగ్గడం కోసం కఠినమైన డైట్లు చేస్తూ, జిమ్‌లలో గంటల తరబడి చెమటోడుస్తున్నారా? అయినా పెద్దగా ఫలితం కనిపించడం లేదా? అయితే మీరు ఈ చిన్న ఇంటి చిట్కాను ఫాలో అవ్వాల్సిందే!

మన వంటింట్లో దొరికే సహజసిద్ధమైన దినుసులతో తయారుచేసుకునే ఒక ‘మ్యాజిక్ పౌడర్’ మీ బరువును వేగంగా తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఉదయాన్నే పరగడుపున కేవలం అరస్పూన్ పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే చాలు.. మీ పొట్ట, నడుము చుట్టూ పేరుకుపోయిన మొండి కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.

జీవక్రియ (Metabolism) రేటును పెంచి, రోజంతా మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచే ఆ అద్భుతమైన పొడి ఏంటి? దాన్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలి? దీనివల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలేంటో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం. నాజూకైన శరీరం కోసం ఈ సింపుల్ ట్రిక్ తప్పక ట్రై చేయండి!”

ఈ మధ్య కాలంలో జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువసేపు కూర్చొని ఉండటం,శారీరక శ్రమ లేకపోవడం, మారిన జీవన శైలి వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. బరువు తగ్గించు కోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్న పెద్దగా ఫలితాన్ని ఇవ్వక నిరాశ చెందుతున్నారు.
Weight Loss tips in telugu
అధిక బరువు కారణంగా డయాబెటిస్, గుండెపోటు, రక్తపోటు వంటి అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువలన అధిక బరువు తగ్గించుకునే ప్రయత్నాలను తప్పనిసరిగా చేయాలి. బరువు తగ్గించుకోవడానికి ఒక పొడి తయారు చేసుకుని ప్రతిరోజు నీటిలో కలిపి తాగితే కచ్చితంగా 15 రోజుల్లో బరువు తగ్గటం గమనించి ఆశ్చర్యపోతారు.

పొయ్యి వెలిగించి పాన్ పెట్టి అర కప్పు సోంపు గింజలు, 15 యాలకులు, రెండు స్పూన్ల లవంగాలు, అర స్పూన్ మిరియాలు, అర అంగుళం దాల్చిన చెక్క ముక్క, చిన్న ముల్లెటి ముక్క వేసి మంచి ఫ్లేవర్ వచ్చేవరకు వేగించాలి. ఇవి కాస్త చల్లారాక మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా మిక్సీ చేయాలి.

ఆ తర్వాత రెండు స్పూన్ల శొంఠి పొడి, అర స్పూన్ జాజికాయ పొడి వేసి మరల ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఈ పొడిని ఒక సీసాలో నిల్వ చేసుకుంటే దాదాపుగా నెల రోజులు పాటు వాడుకోవచ్చు. గ్లాసు గోరువెచ్చని నీటిలో అర స్పూన్ పొడి కలిపి ఐదు నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత స్పూన్ తో బాగా కలిపి ఆ నీటిని తాగాలి. .

ఈ డ్రింక్ ప్రతిరోజు తాగటం వలన శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరగటమే కాకుండా డయాబెటిస్, రక్తపోటు వంటి సమస్యలు కూడా నియంత్రణలో ఉంటాయి. కాస్త ఓపికగా ఇటువంటి పొడులను తయారు చేసుకుని తీసుకుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. కాబట్టి ఈ పొడిని తీసుకొని అధిక బరువు సమస్య నుండి బయట పడండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."