Beauty TipsHealthhealth tips in telugu

పేల సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టే బెస్ట్ న్యాచురల్ చిట్కాలు ఇవే..

Head Lice:పిల్లలు స్కూల్ కు వెళ్లడం మొదలుపెట్టారంటే చాలు.. తలలో పేల సమస్య (Head Lice) సర్వసాధారణంగా మారిపోతుంది. ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపించే ఈ పేలు, తలలో రక్తాన్ని పీలుస్తూ తీవ్రమైన దురదను కలిగిస్తాయి. నలుగురిలో ఉన్నప్పుడు తల గోక్కోవడం వల్ల పిల్లలే కాదు, పెద్దలు కూడా ఎంతో ఇబ్బందిగా, అవమానంగా ఫీల్ అవుతుంటారు.

ఈ పేలను వదిలించుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల కెమికల్స్ తో కూడిన షాంపూలు, లోషన్స్ వాడటం వల్ల.. పిల్లల సున్నితమైన చర్మం పాడవడమే కాకుండా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. మరి దీనికి పరిష్కారం లేదా? అంటే కచ్చితంగా ఉంది! మన వంటింట్లో దొరికే సహజసిద్ధమైన వస్తువులతోనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పేలను, వాటి గుడ్లను (ఈర్లను) పూర్తిగా నిర్మూలించవచ్చు.

ఒక్కసారి వాడితే చాలు పేలన్నీ రాలిపోయే ఆ అద్భుతమైన ఇంటి చిట్కాలు ఏంటి? వాటిని ఎలా తయారు చేయాలి? తలస్నానం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ బ్లాగ్ పోస్ట్ లో వివరంగా తెలుసుకుందాం. మీ పిల్లల జుట్టును ఆరోగ్యంగా కాపాడుకోండి!

పేల సమస్యకు చెక్ పెట్టాలంటే…ఈ చిట్కాలు ఫాలో.. పేల సమస్యను తగ్గించుకోవటానికి చాలా కష్టపడాలి. ఒక్కసారి వచ్చాయంటే తగ్గటం చాలా కష్టం. ఎన్ని నూనెలు వాడిన పెద్దగా పలితం ఉండదు. దాంతో చాలా విసుగు వస్తుంది. అలా విసుగు రాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి పలితాన్ని పొందవచ్చు.

పేలు అనేవి ఒక్కసారి వచ్చాయంటే ఒక పట్టాన వదలవు. .మ‌న ర‌క్తాన్ని తాగుతూ.వెంట్రుకుల‌ను అంటిపెట్టుకుని ఉండే ఈ పేలు చాలా చిరాకు తెప్పిస్తాయి.పేలను వదిలించుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అలాగే వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టి క్రీమ్ లు,నూనెలు వాడుతూ ఉంటాం.

అయిన పెద్దగా ఫలితం ఉండదు. అయితే పేలు సమస్యను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. పేలను తగ్గించుకోవటానికి వేప చాలా బాగా పనిచేస్తుంది. వేప ఆకులను పేస్ట్ గా చేసి దానిలో నిమ్మరసం కలిపి జుట్టు కుదుళ్లకు బాగా పట్టేలా రాసి అరగంట తర్వాత తేలికపాటి షాంపూ తో తలస్నానం చేయాలి.

ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల పేలు నాశ‌నం అవ్వ‌డంతో పాటు చుండ్రు స‌మ‌స్య కూడా దూరం అవుతుంది.పేలను వదిలించుకోవటానికి మెంతులు కూడా చాలా బాగా సహాయపడతాయి. రెండు స్పూన్ల మెంతుల‌ను రాత్రంతా నీటితో నాన‌బెట్టుకుని ఉద‌యాన్నే పేస్ట్ చేసుకోవాలి.

ఈ పేస్ట్‌లో కొద్దిగా హార‌తి క‌ర్ఫూరం క‌లిపి త‌ల‌కు ప‌ట్టించాలి.అర గంట తర్వాత తేలికపాటి షాంపూ తో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల పేలు నాశ‌నం అవ్వ‌డంతో పాటు చుండ్రు స‌మ‌స్య కూడా దూరం అవుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."