రోజూ పాలల్లో ఈ అర స్పూన్ పొడి కలుపుకుని తాగితే.. నరాల బలహీనత మీ దరిదాపుల్లోకి కూడా రాదు!
నరాల బలహీనత… ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది. చేతులు, కాళ్లు వణకడం, ఏదైనా చిన్న వస్తువు పట్టుకోవాలన్నా చేతుల్లో బలం లేకపోవడం, ఏదైనా అనుకోని సంఘటన గురించి విన్నా లేదా చూసినా గుండె దడదడలాడటం లాంటివి దీని ప్రధాన లక్షణాలు.
కొంతమందికి కనీసం పెన్ పట్టుకుని రాయాలన్నా చేతులు వణుకుతుంటాయి, మాట్లాడేటప్పుడు కళ్ల నుంచి నీళ్లు కారుతుంటాయి. ఈ సమస్య ఉన్నవారు ఏ చిన్న పని చేసినా విపరీతమైన అలసటకు గురవుతారు.
పోషకాహార లోపం, శారీరక శ్రమ లేకపోవడం, వయసు పైబడటం వంటివి ఈ నరాల బలహీనతకు ముఖ్య కారణాలు. మంచి పౌష్టికాహారం తీసుకుంటే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చు.

సాధారణంగా ఈ ఇబ్బంది మొదలవగానే చాలామంది మందులు (టాబ్లెట్స్) వాడుతుంటారు. అయితే, ఆ మందులు వాడుతూనే మన ఇంట్లోనే దొరికే కొన్ని సహజ సిద్ధమైన పదార్థాలతో ఒక అద్భుతమైన పొడిని తయారు చేసుకుని వాడితే.. చాలా తొందరగా ఉపశమనం లభిస్తుంది.
పొడి తయారీకి కావాల్సిన పదార్థాలు:
వాల్ నట్స్ – 10 గ్రాములు
మిరియాలు – 10 గ్రాములు
దాల్చిన చెక్క – 10 గ్రాములు
అవిసె గింజలు (Flaxseeds) – 10 గ్రాములు
తయారీ విధానం, వాడే విధానం:
పైన చెప్పిన పదార్థాలన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి.తయారుచేసుకున్న ఈ పొడిని గాలి చొరబడని (ఎయిర్ టైట్) డబ్బాలో నిల్వ చేసుకోండి.ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి నిద్రపోయే ముందు… ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో అర స్పూన్ ఈ పొడిని కలుపుకుని తాగాలి.
ఉపయోగాలు:
ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు తాగితే నరాల బలహీనత తగ్గుముఖం పడుతుంది. ఇందులో వాడిన వాల్ నట్స్, అవిసె గింజలు, దాల్చిన చెక్క లాంటి వాటిలో నరాలకు బలాన్నిచ్చే ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి.
ఇవి నరాలను దృఢంగా చేయడమే కాకుండా, రోజంతా మిమ్మల్ని ఎంతో యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంచుతాయి. ఇవన్నీ మన వంటగదిలో దొరికే సహజసిద్ధమైన పదార్థాలే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న భయం కూడా అక్కర్లేదు. కాస్త ఓపిక చేసుకుని ఈ చిట్కా పాటిస్తే మంచి ఫలితం మీకే కనిపిస్తుంది!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

