Healthhealth tips in telugu

రోగనిరోధక శక్తిని పెంచే బ్లూబెర్రీలు.. రోజుకో గుప్పెడు తింటే జరిగే అద్భుతాలివే!

BlueBerry Benefits In telugu : ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. కానీ ఉరుకులు పరుగుల జీవితంలో, మన కళ్ల ముందే ఉండే ఎన్నో పోషక విలువలున్న ఆహార పదార్థాలను మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ‘బ్లూబెర్రీస్’ (Blueberries). చూసేందుకు చిన్నగా, ముదురు నీలం రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ పండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.

అసలు ఈ సీజన్‌లో బ్లూబెర్రీలను ఎందుకు క్రమం తప్పకుండా తినాలి? వీటి వల్ల శరీరానికి అందే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? వీటిని ప్రతిరోజూ ఎంత మోతాదులో తీసుకోవాలి? అనే పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. చదివి మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోండి!

బ్లూబెర్రీలలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఇవి ఈ సీజన్ లో చాలా విరివిగా లభిస్తాయి. బ్లూబెర్రీలలో విటమిన్ ఎ,విటమిన్ బి కాంప్లెక్స్,విటమిన్ సి,విటమిన్-ఇ,జింక్,మెగ్నీషియం,భాస్వరం,పొటాషియం,సోడియం,రాగి వంటివి సమృద్దిగా ఉంటాయి.

ఈ సీజన్లో సమృద్ధిగా దొరికే బ్లూబెర్రీలను కచ్చితంగా తినాలి. ఎందుకంటే బ్లూబెర్రీస్ లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ పండ్లను అన్ని వయసుల వారు తినవచ్చు. ముఖ్యంగా పిల్లలు తింటే వారికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి. రోజు పిల్లలు నాలుగు బ్లూబెర్రీలను తింటే మెదడు చురుగ్గా పనిచేసి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అయి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. శారీరక., మానసిక ఎదుగుదల బాగుంటుంది.ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవటానికి జీర్ణ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. బ్లూ బెర్రీస్ లో ఉండే యాంటీ యాక్సిడెంట్ అయిన ఆంథోసైనిన్స్ గుండెపోటు నుంచి కాపాడతాయి.

అంతేకాకుండా బ్లూ బెర్రీస్ లో ఉండే ఫైబర్ రక్తంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో సహాయపడుతుంది. బ్లూ బెర్రీస్ లో ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దాంతో గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. బ్లూ బెర్రీస్ జ్ఞాపక శక్తిని పెంచటమే కాకుండా మెదడు చురుగ్గా ఉండటానికి సహాయపడుతుంది.

మెదడు ఆరోగ్యానికి అవసరమైన అన్నీ రకాల పోషకాలు ఈ బ్యూబెర్రీ లలో ఉన్నాయి. వయస్సు పెరిగే కొద్ది వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలను కూడా తగ్గిస్తుంది. బ్లూ బెర్రీస్‌లో వుండే యాంటీ ‘ఆక్సిడేటివ్‌ ఫైటో కెమికల్స్‌’, ఇలా జ్ఞాపక శక్తి పెరుగుదలకి కారణం అని ఒక పరిశోదనలో తెలిసింది. కాబట్టి ఈ పండ్లను తిని ఈ ప్రయోజనాలను పొందండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."