Beauty TipsHealthhealth tips in telugu

పార్లర్‌‌తో పనేలేదు.. చిటికెడు పసుపుతో ఎంతటి నల్లని చర్మమైనా తెల్లగా మెరిసిపోవడం ఖాయం!

Face Glow Tips:అందంగా, కాంతివంతంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ పెరిగిన కాలుష్యం, ఎండ ప్రభావం (సన్ టాన్), దుమ్ము, ధూళి, మరియు పని ఒత్తిడి వల్ల చర్మం తన సహజ కాంతిని కోల్పోయి నల్లగా, నిర్జీవంగా మారుతుంది. ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు అందాన్ని మరింత తగ్గిస్తాయి.

వీటిని వదిలించుకోవడానికి చాలామంది వేలాది రూపాయలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. రసాయనాలతో కూడిన ఫేస్ క్రీములు వాడి చర్మాన్ని మరింత పాడుచేసుకుంటారు. కానీ, మన వంటగదిలో ఎప్పుడూ ఉండే ‘పసుపు’ (Turmeric) తో ఎలాంటి ఖర్చు లేకుండా సహజంగానే మన చర్మాన్ని తెల్లగా, కాంతివంతంగా మార్చుకోవచ్చని మీకు తెలుసా?

పసుపుతో ఇలా చేస్తే చాలు ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మెరిసిపోతుంది.. ముఖం అందంగా ఉండాలని మనలో చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

అలాగే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టినా పెద్దగా ప్రయోజనం లేక చాలా నిరాశ చెందుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడు ఒక ప్యాక్ గురించి తెలుసుకుందాం.

ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి,పావు స్పూన్ లో సగం పసుపు వేసి సరిపడా రోజ్ వాటర్ పోసి పేస్ట్ మాదిరిగా కలపాలి. ముఖం శుభ్రంగా కడిగి తయారుచేసి పెట్టుకున్న పేస్ట్ ని ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే ముఖం తెల్లగా మెరిసిపోతుంది.

శనగపిండిని చర్మ సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు. చర్మం మీద మృత కణాలను,దుమ్ము,ధూళి వంటి వాటిని తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. శనగపిండిలో ఉండ్ జింక్ చర్మం మీద ఉన్న అదనపు జిడ్డును తొలగిస్తుంది. శనగపిండిలో (besan flour) ఆల్కలైజింగ్ లక్షణాలను కలిగి ఉండుట వలన చర్మ సమతుల్యతను కాపాడుతుంది.

పసుపును కూడా పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. రోజ్ వాటర్ లో ఉన్న లక్షణాలు చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. ఈ ప్యాక్ వేసుకొని అందమైన మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోండీ.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."