Healthhealth tips in telugu

రాత్రి పడుకునే ముందు ఇది తీసుకుంటే… కీళ్ల నొప్పులు, డయాబెటిస్, అధిక బరువు మాయం!

Joint Pains In Telugu : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, నిద్రలేమి, అధిక బరువు మరియు డయాబెటిస్ వంటి సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. వీటన్నింటికీ రకరకాల మందులు వాడి విసిగిపోయారా?

అయితే రాత్రి పడుకునే ముందు ఒక్కసారి ఈ చిన్న న్యాచురల్ చిట్కాను పాటిస్తే అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి. ఆ అద్భుతమైన రెమెడీ ఏంటి? దాన్ని ఎలా తీసుకోవాలి? దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.

ఈ రోజుల్లో సమస్యలు రావటం అయితే చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఆ సమస్యలను తగ్గించుకోవటానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది. ముఖ్యంగా కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులు,నడుము నొప్పి, నిద్రలేమి, డయాబెటిస్ వంటి అనేక రకాల సమస్యలు వస్తున్నాయి.
Biryani leaves health benefits In Telugu
ఈరోజు మనం ఒక మంచి డ్రింక్ గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సమస్య రాగానే మందుల జోలికి వెళ్లకుండా ఇంటి చిట్కాల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే కీళ్ల నొప్పులు, డయాబెటిస్, శ్వాసకోశ వ్యాధులు తగ్గించడానికి సహాయపడుతుంది.

అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా శరీరం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. సీజనల్ గా వచ్చే దగ్గు,గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ వంటి వాటిని కూడా చాలా సులభంగా తగ్గిస్తుంది. ఈ మధ్య కాలంలో తీవ్రమైన ఒత్తిడి కారణంగా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.

ఈ డ్రింక్ తయారీ కోసం 3 బిరియాని ఆకులు,5 లవంగాలను తీసుకొని ఒక గ్లాస్ లో వేసి దానిలో వేడి నీటిని పోసి అరగంట అయ్యాక ఆ నీటిని వడకట్టి రాత్రి పడుకోవటానికి ముందు తాగాలి. ఈ విధంగా పది రోజుల పాటు తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ డ్రింక్ తాగితే కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,డయబెటిస్,నిద్రలేమి,అధిక బరువు సమస్యలు తగ్గుతాయి.

ఈ డ్రింక్ ని జుట్టుకి పట్టించి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూ తో తలస్నానం చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే చుండ్రు సమస్య కూడా ఉండదు. కాబట్టి ఈ డ్రింక్ ని ట్రై చేయండి. కాస్త ఓపికగా చేస్తే చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సమస్యల నుండి బయట పడవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."