Healthhealth tips in telugu

రోజుకు ఇవి 3 తింటే చాలు.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ మాయమై గుండె పదిలంగా ఉంటుంది!

Best Dry Fruits Heart Health : మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలు, హై బీపీ (రక్తపోటు), మరియు చెడు కొలెస్ట్రాల్ (Bad Cholesterol) బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చాలామంది ఎన్నో మందులు వాడుతుంటారు.

కానీ, ప్రకృతి సహజంగా లభించే ఒక అద్భుతమైన ఆహారాన్ని రోజుకు కేవలం మూడు చొప్పున తింటే చాలు.. మీ రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది. అంతేకాకుండా, రక్తపోటు అదుపులో ఉండి గుండె పదిలంగా ఉంటుంది. ఇంతకీ రోజుకు 3 తినాల్సిన ఆ అద్భుతమైన ఆహారం ఏమిటి? వాటి వల్ల కలిగే అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో గుండె ఒకటి. గుండె ఆరోగ్యంగా ఉండేలా మన ఆహారంలో మార్పులు చేసుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ లేకుండా రక్తప్రవాహం సాఫీగా జరిగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసే కొన్ని Dry Fruits గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితుల కారణంగా Dry Fruits వాడకం కూడా పెరిగింది.
Diabetes patients eat almonds In Telugu
రోజుకి 3 బాదం పప్పులను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తొక్క తీసి తినాలి. కరిగే ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఇ, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్దిగా ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ తొలగించి రక్తప్రవాహం బాగా సాగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

రోజుకి 3 పిస్తా పప్పులను తింటే మంచిది. బాదం పప్పుతో పోలిస్తే పిస్తా పప్పులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. పిస్తాపప్పులో ప్రొటీన్లు, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడటమే కాకుండా అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

వాల్ నట్స్ కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో సహాయపడుతుంది. వాల్ నట్స్ లో అమినో యాసిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి రోజూ రెండు వాల్‌నట్‌లను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

ప్రతి రోజు ఈ మూడు Dry Fruits ని తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అధిక బరువు,డయాబెటిస్ వంటి సమస్యలు కూడా నియంత్రణలో ఉంటాయి. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు. Dry Fruits ఇప్పుడు అందరికీ అందుబాటులోనే ఉంటున్నాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."