ఈ ఒక్క పవర్‌ఫుల్ మూలిక చాలు.. మీ మెదడు కంప్యూటర్‌లా పనిచేస్తుంది, అల్జీమర్స్ దరిచేరదు!
Vasa Kommu Benefits In telugu : వయసు పెరిగే కొద్దీ చాలా మందిని వేధించే ప్రధాన సమస్య మతిమరుపు. ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో, ఒత్తిడి కారణంగా చిన్న వయసులోనే జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, అల్జీమర్స్ వంటి భయంకరమైన మెదడు సంబంధిత వ్యాధుల బారిన పడటం చూస్తున్నాం.
అయితే, మన ఆయుర్వేదంలో దీనికి ఓ అద్భుతమైన పరిష్కారం ఉంది. ఒక ప్రత్యేకమైన మూలికను రెగ్యులర్ గా వాడటం వల్ల మెదడు కణాలు యాక్టివ్ గా మారి, అద్భుతమైన జ్ఞాపకశక్తి మీ సొంతం అవుతుంది. మెదడును చురుగ్గా ఉంచి, అల్జీమర్స్ ముప్పును పూర్తిగా తగ్గించే ఆ పవర్‌ఫుల్ మూలిక ఏంటి? దాని ప్రయోజనాలు, ఎలా వాడాలో ఈ ఆర్టికల్ లో వివరంగా చూద్దాం.
వస అనేది ఒక రకమైన ఔషధ మొక్క. దీనిని ఎన్నో వందల ఏళ్ల నుండి ఆయుర్వేదంలో వాడు తున్నారు. వస కొమ్ము గొంతులోని కఫం తొలగించటమే కాకుండా మాటలు స్పస్టంగా రావడానికి ఉపకరిస్తుందని భావిస్తారు. పెల్లెటూర్లలో పుట్టిన ప్రతి బిడ్డకు పురిట్లోనే వస కొమ్మును చనుబాలతో అరగదీసి పట్టేవారు.

ఇప్పటికీ ఈ సాంప్రదాయం చాలా ప్రాంతాలలో కొనసాగుతుంది. వస వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణాశయంలో వేడిని పుట్టించి అల్సర్లకు, గ్యాస్, అసిడిటీ సమస్యలకు చెక్ పెడుతుంది. అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు ఉన్నవారు వస చూర్ణం తీసుకుంటే ఆ సమస్యలు తగ్గటమే కాకుండా ఆకలి లేని వారిలో ఆకలి కూడా పుడుతుంది.
నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగు పరచడంలో సహాయపడి ఆందోళన,ఒత్తిడిని తగ్గిస్తుంది. వస కొమ్ములను పాలలో వేసి మరిగించి కనీసం ఒక నెలపాటు తీసుకుంటే జ్ఞాపకశక్తి సమస్యలు తగ్గటమే కాకుండా వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ కూడా తగ్గుతుంది. అలాగే కంఠస్వరం బాగుంటుంది.
వసకొమ్ముల పొడిని ఆవనూనెతో కలిపి రాస్తుంటే శరీర భాగాలపై ఏర్పడే వాపులు, నొప్పులు తగ్గుతాయి. వస చూర్ణం అయితే రోజుకు 1-2 చిటికెలు తీసుకోవచ్చు. భోజనం అనంతరం తేనెతో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. వస క్యాప్సూల్స్ రూపంలోనూ లభిస్తుంది. వసలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉండటం వలన చర్మ సమస్యలకు పనిచేస్తుంది.
ఒక టీస్పూన్ వస చూర్ణం తీసుకుని నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి చర్మంపై సమస్య ఉన్న చోట రాస్తే ఉపశమనం లభిస్తుంది. వస కొమ్మును తీసుకొనే ముందు ఒకసారి ఆయుర్వేద వైధ్య నిపుణుని సలహా తీసుకోవటం మంచిది. ఈ మూలికను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. కాబట్టి మీరు కూడా వాడి ఈ ప్రయోజనాలను పొందండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

