టిఫిన్స్, అన్నంలోకి అదిరిపోయే ‘ఉల్లిపాయ పచ్చడి’.. ఇలా చేస్తే 15 రోజులు అస్సలు పాడవదు!
Onion Chutney:రోజూ ఉదయం టిఫిన్స్‌లోకి పల్లీలు, పుట్నాల చట్నీలు తిని బోర్ కొట్టిందా? అయితే దానికి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఈ ‘ఉల్లిపాయ పచ్చడి’. వేడి వేడి ఇడ్లీ, క్రిస్పీ దోశలతో పాటే కాకుండా.. మధ్యాహ్నం అన్నంలోకి కూడా ఈ పచ్చడి అద్భుతంగా సెట్ అవుతుంది. చాలామంది ఉల్లిపాయ పచ్చడి చేస్తే త్వరగా పాడైపోతుందని అనుకుంటారు.
కానీ, సరైన కొలతలతో, నీటి తడి తగలకుండా పక్కా పద్ధతిలో చేస్తే కనీసం 15 రోజుల పాటు ఈ పచ్చడి ఫ్రెష్‌గా నిల్వ ఉంటుంది. నోటికి ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ ఉల్లిపాయ నిల్వ పచ్చడిని సింపుల్‌గా, తక్కువ సమయంలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.
ఉల్లిపాయ చట్నీ.. తక్కువ పదార్ధాలతో ఎంత టేస్టీగా తయారు చేసుకునే చట్నీ ఉల్లిపాయ చట్నీ. ఇడ్లీ,దోశ,ఉప్మా వంటి టిఫిన్స్ లోకి ఈ చట్నీ రెడీ చేసుకున్నారంటే కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది.
కావాల్సిన పదార్ధాలు
ఉల్లిపాయలు – 2
జీలకర్ర – 1 టీ స్పూన్
మెంతులు – ½ టీ స్పూన్
ఎండుమిర్చి – 7-8
తాలింపు కోసం..
శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్
ఆవాలు – ½ టీ స్పూన్
జీలకర్ర – టీ స్పూన్
ఎండుమిర్చి – 2-3
పసుపు – ½ టీ స్పూన్
వెల్లుల్లి పేస్ట్ – 7-8
చింతపండు – 15 గ్రాములు
తయారీ విధానం
1.ముందుగా ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని టీ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర,మెంతులు ,ఎండుమిర్చి వేసి వేపుకోవాలి.
3.వేగాక వేరోక ప్టేల్ లోకి తీసుకోవాలి.
4.ఇప్పుడు తాలింపు కోసం అదే బాండీ లో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులోకి శనగపప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి ,పసుపు ,ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి.
5.ముందుగా వేపి పక్కన పెట్టుకున్న జీలకర్ర ,మెంతులను మిక్సి జార్ లో వేసి పొడి చేసుకోవాలి.
6.అందులోకి వెల్లుల్లి రెబ్బలు,నానబెట్టిన చింతపండు వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.
7.గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని మగ్గుతున్న ఉల్లిపాయల్లో వేసి కొద్దిగా నీళ్లను కూడా యాడ్ చేసుకోవాలి.
8.నూనె పైకి తేలే వరకు ఉడికించుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఉల్లిపాయ చట్నీ రెడీ.
9.ఈ పచ్చడి పదిహేను రోజుల వరకు నిలువ ఉంటుంది.

