ఉదయం హడావిడిలో కమ్మని ‘ఎగ్ పరాఠా’ను ఇలా సులభంగా చేసుకోండి!
Egg Paratha:ఉదయం నిద్రలేవగానే బ్రేక్ ఫాస్ట్ ఏం చేయాలనేది గృహిణులకు వచ్చే పెద్ద సందేహం. రోజూ తినే టిఫిన్లకు బదులుగా, అప్పుడప్పుడు ఆరోగ్యానికి మేలు చేసే హై-ప్రోటీన్ ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉరుకులు పరుగుల జీవితంలో శరీరానికి రోజంతా సరిపడా శక్తిని ఇచ్చే బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ‘ఎగ్ పరాఠా’.
గుడ్డులోని పోషకాలు, గోధుమపిండిలోని కార్బోహైడ్రేట్స్ కలిసి దీనిని ఒక కంప్లీట్ మీల్ గా మారుస్తాయి. పిల్లల లంచ్ బాక్స్ లోకి కూడా ఇదొక పర్ఫెక్ట్ ఆప్షన్. ఎంతో మృదువుగా, నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉండే ఈ కమ్మని ఎగ్ పరాఠాను ఇంట్లోనే ఎంతో సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఎగ్ పరాటా.. ఆరోగ్యకరమైనా పరాటను మరింత హెల్తీగా ఉడికించిన ఎగ్ తో చేసి చూడండి. రుచి అదిరిపోతుంది.
కావాల్సిన పదార్ధాలు
గోధుమ పిండి – 2 కప్పులు
ఉడికించిన గుడ్లు – 4
పచ్చిమిర్చి – 2
కొత్తిమీర – ½ కప్పు
ఉప్పు – ½ టీ స్పూన్
కారం – ½ టీ స్పూన్
ధనియాల పొడి – ½ టీస్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
గరంమాసాలా – ¼ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ టీ స్పూన్
తయారీ విధానం
1.గోధుమ పిండిలోకి ఉప్పు,కొద్దిగా నూనె వేసి చపాతి పిండిలా సాఫ్ట్ గా కలుపుకోవాలి.
2.కలుపుకున్న పిండిని అరగంట పాటు పక్కనపెట్టుకోవాలి.
3.ఇప్పుడు ఉడికించిన గుడ్లను తురుముకోని మెత్తగా చేసుకోవాలి.
4.అందులోకి పచ్చిమిర్చి ,కొత్తిమీర ,ఉప్పు,కారం ,ధనియాల పొడి,గరం మసాలా,అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి.
5.కలిపి పెట్టుకున్న పిండిని పూరీల చేసుకోని అందులోకి కొద్దిగా స్టఫ్ ని పెట్టుకోని ఎడ్జస్ ని క్లోజ్ చేసుకోవాలి.
6.ఇప్పుడు స్టఫ్ బయటకు రాకుండా పరాటాలను నెమ్మదిగా తాల్చుకోవాలి.
7.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని వేడెక్కని పెనం పై పరాటాలను జాగ్రత్తగా వేసుకోవాలి.
8.మీడియం మంట పై వేపుకోవలి.
9.కరిగించిన బటర్ వేసి రెండు వైపులా కాల్చుకుంటే టేస్టీ టేస్టీ గుడ్డు పరాటా రెడీ.

