Healthhealth tips in telugu

ఎర్ర ఆపిల్ కంటే గ్రీన్ ఆపిల్ ఎందుకు మంచిదో తెలుసా? ఈ ఆరోగ్య రహస్యం తెలిస్తే రోజూ తింటారు!

Green Apple health benefits in telugu : రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ కు దూరంగా ఉండొచ్చు” అనే నానుడి మనందరికీ తెలిసిందే. అయితే, మనం రెగ్యులర్ గా తినే ఎర్రటి ఆపిల్స్ కంటే.. గ్రీన్ ఆపిల్స్ (Green Apples) మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. రుచిలో కాస్త పుల్లగా, మధురంగా ఉండే ఈ పచ్చని ఆపిల్స్ లో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారికి ఇదొక అద్భుతమైన వరం అని చెప్పవచ్చు. అసలు ఈ గ్రీన్ ఆపిల్స్ ని రోజూ తినడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? ఇందులో దాగి ఉన్న ఆ ఆరోగ్య రహస్యాలు ఏంటో తెలిస్తే.. మీరు కచ్చితంగా ఈ పండును వదిలిపెట్టరు. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

గ్రీన్ ఆపిల్ అనేది ఒకప్పుడు చాలా అరుదుగా లభించేది. ఇప్పుడు విరివిగానే లభిస్తుంది. పులుపు,తియ్యని రుచి కలిగి ఉండే ఈ ఆపిల్ లో ప్రోటీన్స్, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఐరన్., రాగి, జింక్, మాంగనీస్, పొటాషియం వంటివి కూడా ఉంటాయి.

ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన రోజుకు ఒక ఆపిల్ తింటే ఎన్నో సమస్యల నుంచి బయట పడవచ్చు. జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ ఉండవు. రక్తంలో కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. గుండెకు రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గ్రీన్ ఆపిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో కణాల నిర్మాణానికి సహాయపడతాయి.

థైరాయిడ్ సమస్యలు, కీళ్లకు సంబంధించిన సమస్యలు, మతిమరుపు సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు ఒక ఆపిల్ తింటే ఆ సమస్యల నుంచి బయటపడతారు. మెదడులో ఎసిటైల్ కోలీన్ స్రావాన్ని పెంచటం ద్వారా న్యూరో ట్రాన్స్ మిటర్ల పనితీరు మెరుగై అల్జీమర్స్ సమస్య నుండి విముక్తి లభించేలా చేస్తుంది.

గ్రీన్ ఆపిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన కణాల పునర్నిర్మాణం మరియు కణాల పునరుజ్జీవనంలో సహాయపడుతుంది. కాలేయ పనితీరును మెరుగుపరచి కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ సీజన్ లో వచ్చే ఆస్తమాను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. బరువు తగ్గటానికి సహాయపడుతుంది.

మొటిమలు నివారించటంతోపాటు, కళ్ళక్రింద ఉండే నల్లటి వలయాలు తొలగించటానికి సహాయపడుతుంది. ఒత్తిడి కారణంగా వచ్చే మైగ్రేన్ తలనొప్పి నుండి విముక్తికి గ్రీన్ యాపిల్ తినటం .చాలా మంచిది. జుట్టు పెరుగుదలకు, చుండ్రు నివారణకు, జుట్టురాలే సమస్యను తొలగిస్తుంది. త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా నివారిస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."