Healthhealth tips in telugu

శరీరంలో కొవ్వును కరిగించి, రోగనిరోధక శక్తిని పెంచే ‘చారు’.. ఈ వాతావరణానికి బెస్ట్ మెడిసిన్!

How To Make Horse Gram Soup : ప్రస్తుతం వాతావరణం చల్లబడటం వల్ల జలుబు, దగ్గు, కఫం వంటి అనారోగ్య సమస్యలు త్వరగా దాడి చేస్తాయి. ఇలాంటి సీజన్‌లో మన శరీరానికి సహజంగా వేడిని అందించి, రోగనిరోధక శక్తిని అమాంతం పెంచే బెస్ట్ సూపర్ ఫుడ్ ‘ఉలవలు’.

వారానికి కనీసం రెండు సార్లు ఉలవలతో చేసిన రసం (ఉలవచారు) తాగడం వల్ల అనారోగ్య సమస్యలు అసలు దరిచేరవు. శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వును కరిగించి బరువు తగ్గించడంలోనూ, కిడ్నీలో రాళ్లను కరిగించడంలోనూ ఉలవలు అద్భుతంగా పనిచేస్తాయి.

ప్రోటీన్లు, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఉలవచారును డైట్‌లో ఎందుకు చేర్చుకోవాలి? ఈ సీజన్‌లో ఉలవ రసం తాగడం వల్ల కలిగే ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? అన్న పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.

ఉలవలను ఒక్కప్పుడు పెద్దగా వాడేవారు కాదు. కానీ ఈ మధ్య కాలంలో ఉలవల్లో ఉన్న ప్రయోజనాల కారణంగా వాడటం అలవాటు చేసుకున్నారు. వారంలో రెండు సార్లు ఉలవలతో రసం చేసుకొని అన్నంలో కలుపుకొని తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

ఆహారంలో ఈ రసం ఉండేలా చూసుకుంటే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అలాగే ఉలవల్లో ఐరన్, కాల్షియం,ఫైబర్,ప్రోటీన్ వంటివి సమృద్దిగా ఉంటాయి. మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఈ ఉలవల రసం బాగా పనిచేస్తుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
Diabetes diet in telugu
ఈ కాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఉలవల్లో పాలీఫినాల్స్, ఫ్లావోనాయిడ్లు కాలేయం, పిత్తాశయానికి రక్షణగా ఉంటాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ నియంత్రించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఉలవల రసం ఎలా చేయాలో చూద్దాం. ఒక కప్పు ఉలవలను శుభ్రంగా కడిగి నీటిని పోసి 5 గంటలు నానబెట్టాలి.

నానిన ఉలవలను ఉడికించాలి. మిక్సీ జార్ లో ఉడికించిన ఉలవలు, ఒక ఉల్లిపాయ ముక్కలు, రెండు స్పూన్ల కొబ్బరి పొడి,4 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఆ తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టి రెండు స్పూన్ల నూనె వేసి కాస్త వేడి అయ్యాక అరస్పూన్ ఆవాలు, చిటికెడు ఇంగువ వేసి వేగాక రెండు గ్లాసుల నీటిని పోసి…ఆ తర్వాత ఉలవల పేస్ట్ వేసి బాగా కలపాలి.

ఆ తర్వాత కొంచెం చింతపండు రసం,సరిపడా ఉప్పు వేసి 6 నుంచి 8 నిమిషాలు మరిగించాలి. చివరగా కొత్తిమీర కలపాలి. అంతే ఉలవల రసం రెడీ. ఈ రసంను వారంలో రెండు సార్లు తీసుకుంటే ముఖ్యంగా ఈ సీజన్ లో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కాస్త ఓపికగా ఇటువంటి రసంను చేసుకొని తింటే మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."