Healthhealth tips in telugu

రోజూ 1 స్పూన్ ఈ పొడి తింటే కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనత మాయం!

Joint Pains Powder : వయసుతో సంబంధం లేకుండా నేటి రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలు కీళ్ల నొప్పులు మరియు ఎముకల బలహీనత. శరీరంలో కాల్షియం లోపించడం వల్లే ఈ సమస్యలు తలెత్తుతాయి.

అయితే, ఇంట్లోనే దొరికే సహజమైన వస్తువులతో తయారు చేసిన ఈ అద్భుతమైన పొడిని రోజుకు ఒక స్పూన్ తీసుకోవడం ద్వారా మీ ఎముకలను దృఢంగా మార్చుకోవచ్చు. కాల్షియం లోపాన్ని నివారించి, కీళ్ల నొప్పులకు చెక్ పెట్టే ఆ పవర్‌ఫుల్ పొడి ఏంటి? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.

ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, భుజాల నొప్పులు వంటివి ఎముకల బలహీనత కారణంగా వస్తున్నాయి. ఈ నొప్పుల నుండి ఉపశమనం .పొందాలంటే మూడు రకాల గింజలను కలిపి పొడిగా తయారు చేసుకుని ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదులో తీసుకోవాలి. ఈ మూడు రకాల గింజలు మార్కెట్లో సులభంగా అందుబాటులోనే ఉంటాయి.

అవిసె గింజలలో ఒమేగా 3, కాల్షియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఈ గింజలలో ఉండే కాల్షియం ఎముకల బలహీనతను తగ్గించి బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ గింజలలో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రించి బరువును నియంత్రణలో ఉంచుతుంది

ఇక గుమ్మడి గింజల విషయానికొస్తే ప్రోటీన్,ఫైబర్, ఒమేగా 3, మెగ్నీషియం వంటి పాషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ గింజలు శరీరానికి శక్తిని ఇవ్వటమే కాకుండా శరీరంలో ఉన్న ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి. ఇవి కూడా సూపర్ మార్కెట్స్ మరియు డ్రై ఫ్రూట్ షాప్ లలో సులువుగానే లభ్యం అవుతాయి.

సబ్జా గింజలలో ప్రోటీన్, ఫైబర్,కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం అనేవి ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇందులో ఉండే ఒమేగా 3 నొప్పులు తగ్గడానికి సహాయపడుతుంది. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి ఒక కప్పు ఆవిసే గింజలను వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత ఒక కప్పు సబ్జా గింజలను వేగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు గుమ్మడి గీణజాలను వేగించి పక్కన పెట్టుకోవాలి. ఈ మూడు రకాల గింజలు చల్లారాక మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకొని సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజు ఒక స్పూన్ పొడిని మజ్జిగలో కలుపుకొని తాగాలి…లేదంటే అన్నంలోనైనా కలుపుకొని తినొచ్చు.

ఇలా కొద్దిరోజుల పాటు ప్రతి రోజు ఆహారంలో భాగం చేసుకుంటే ఎముకల నొప్పులు, నడుము నొప్పి మాయం అవడమే కాకుండా.. మళ్లీ నొప్పులు రావు. అలాగే కాల్షియం లోపం కూడా ఉండదు. కాస్త ఓపికగా శ్రద్ద పెట్టి ఇలా పొడి తయారుచేసుకొని వాడితే నొప్పులు తగ్గటమే కాకుండా అధిక బరువు సమస్య నుండి కూడా బయట పడవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."