Beauty TipsHealthhealth tips in telugu

40 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్లలా కనిపించాలా? ముడతలు, మచ్చలు మాయం చేసే అద్భుతమైన చిట్కా!

Wrinkles remove Home Remedies In Telugu :ముఖంపై ముడతలు, నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్… ఇవన్నీ వయసు పెరుగుతోందనడానికి సంకేతాలు. ముఖ్యంగా 30, 40 ఏళ్లు దాటగానే చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోయి వృద్ధాప్య ఛాయలు (Aging Signs) స్పష్టంగా కనిపిస్తుంటాయి.

వీటిని తగ్గించుకోవడానికి చాలామంది ఖరీదైన యాంటీ ఏజింగ్ క్రీమ్స్, ఫేస్ ప్యాక్స్ వాడుతుంటారు. కానీ, ఎటువంటి కెమికల్స్ లేని మన వంటగదిలో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతోనే చర్మాన్ని టైట్ గా, కాంతివంతంగా మార్చుకోవచ్చు.

కేవలం కొన్ని సింపుల్ స్కిన్ కేర్ రూల్స్ పాటిస్తే.. 40 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల యంగ్ అండ్ గ్లోయింగ్ లుక్ మీ సొంతం అవుతుంది. ముడతలు, నల్ల మచ్చలను మాయం చేసే ఆ అద్భుతమైన నాచురల్ చిట్కాలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

ఆఫీస్ లో కూర్చొని పనిచేసే వారి కంటే….బయట తిరిగి పనిచేసే వారికి ముప్పై లలోనే చర్మం మీద గీతలు పడటం, ముడతలు,చర్మం పొడి బారటం వంటి సమస్యలు వచ్చేస్తున్నాయి. ఇటువంటి సమస్యలకు మార్కెట్ లో దొరికే క్రీమ్స్ కన్నా ఇంటిలో మనకు అందుబాటులో ఉండే వస్తువులతో పరిష్కారం కనుక్కోవటం ఉత్తమం.

బాగా పండిన అరటిపండును గుజ్జుగా చేసి ముఖానికి పట్టించాలి. అరగంట అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. బయటకు వెళ్లి వచ్చాక ఈ విధంగా చేస్తే ముఖం మీద గీతలు పడే అవకాశాలు తగ్గుతాయి. అలాగే ముఖం మీద నల్లని మచ్చలు కూడా తొలగిపోతాయి.

అనాస గుజ్జు కూడా ముఖం మీద మంచి ప్రభావాన్ని చూపుతుంది. అనాస గుజ్జు లేదా రసంను తీసుకోని ముఖానికి,మెడకు రాసుకొని మర్దన చేసుకొని పది నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముడతలు,గీతలు రావు.

ఒక స్పూన్ ఆలివ్ నూనెకు కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకున్నా మంచి పలితం కనపడుతుంది. కాబట్టి ఈ చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో ముఖ చర్మం కాంతివంతంగా మారుతుంది.

బొప్పాయి గుజ్జుకు కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి అరగంట అయ్యాక మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే మంచి పలితాన్ని పొందవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."