ఎంతటి గార పట్టిన పసుపు పళ్లు అయినా.. ఈ సింపుల్ చిట్కాతో 5 నిమిషాల్లో తెల్లగా మారడం గ్యారెంటీ!
Yellow teeth:మనం ఎదుటివారితో మాట్లాడేటప్పుడు లేదా నవ్వేటప్పుడు అందరి దృష్టి ముందుగా మన ముఖం, పళ్ల పైనే పడుతుంది. పళ్లు తెల్లగా, అందంగా ఉంటే మన ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. కానీ, ఎక్కువ టీ/కాఫీలు తాగడం, గుట్కా నమలడం, సరైన ఓరల్ హైజీన్ పాటించకపోవడం వల్ల చాలామంది పళ్లు పసుపు రంగులోకి మారి గార పట్టి ఉంటాయి.
దీనివల్ల నలుగురిలో నవ్వాలంటే తీవ్ర ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. పళ్లను తెల్లగా మార్చుకోవడానికి ఎంతో ఖర్చు పెట్టి డెంటల్ క్లినిక్స్ చుట్టూ తిరుగుతుంటారు. అయితే, ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతో కేవలం 5 నిమిషాల్లో ఆ పసుపు గారను వదిలించుకోవచ్చు. ఇంతకీ పళ్లను ముత్యాల్లా మెరిపించే ఆ మ్యాజిక్ హోమ్ రెమెడీ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
ఎంతటి గార పట్టిన పసుపు పళ్ళు అయినా 5 నిమిషాల్లో తెల్లగా ముత్యాల్లా మెరిసిపోతాయి.. కొంత మంది దంతాలు ఎంత శుభ్రం చేసిన సరే పసుపు రంగులోకి మారతాయి. అలాగే గార పడుతూ ఉంటాయి.

ఈ సమస్యను తగ్గించుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. దాంతో నిరాశ చెంది మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి.
అదే ఇంటి చిట్కాలు అయితే పంటి మీద పసుపు,గార శాశ్వతంగా తొలగిపోతాయి. పంటి మీద గార,పసుపు రంగు ఉంటే నలుగురిలో మాట్లాడాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి,అరస్పూన్ ఆలివ్ ఆయిల్,ఒక స్పూన్ నిమ్మరసం ఒక స్పూన్ రెగ్యులర్ గా వాడే టూత్ పేస్ట్ వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని బ్రష్ సాయంతో పళ్లను రెండు నిమిషాల పాటు రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే క్రమంగా పంటి మీద గార,పసుపు రంగు తొలగిపోతాయి. దంతాలను తెల్లగా మార్చటానికి కాఫీ పొడి చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
పళ్లను తెల్లగా మార్చుకోవటానికి ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పళ్లను తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

