జామకాయ తినేటప్పుడు విత్తనాలు పారేస్తున్నారా? ఈ అద్భుతమైన నిజాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
Guava Seeds benefits : పేదల పాలిట యాపిల్” అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది జామకాయ. రుచిలో తియ్యగా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జామకాయను ఇష్టపడని వారు ఉండరు. అయితే, జామకాయ తింటున్నప్పుడు చాలామందికి వచ్చే అతిపెద్ద సందేహం.. ఆ గింజలను నమలాలా? మింగాలా? లేక పారేయాలా? అని.
గింజలు తింటే కడుపునొప్పి వస్తుందని, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయని, అపెండిసైటిస్ వస్తుందని రకరకాల అపోహలతో చాలామంది విత్తనాలను తీసేసి కేవలం మెత్తటి భాగాన్ని మాత్రమే తింటుంటారు.
కానీ, ఆ గింజల్లోనే అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? ఆ గింజలను తింటే మన శరీరంలో జరిగే మార్పులు చూస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంతకీ జామ విత్తనాలను ఎలా తినాలి? వాటి వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
జామ కాయ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. జామ కాయను పేదవాని ఆపిల్ అని పిలుస్తారు. తక్కువ ధరలో యాపిల్ లో ఉండే పోషక విలువలు అన్ని ఉంటాయి. జామకాయ తినేటప్పుడు వాటిలో గింజలు అంటే విత్తనాలు ఉంటాయి కదా..వాటిని తినవచ్చా అనే సందేహం చాలామందికి వస్తుంది.

జామకాయ విత్తనాలలో కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ విత్తనాలలో ఫైబర్ సమృద్దిగా ఉండటం వలన మలబద్దకం, అసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు లేకుండా చేయటమే కాకుండా జీర్ణ క్రియ బాగా జరిగేలా చేసి బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జామకాయ విత్తనాలలో ఉండే పాలిఫినాల్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ ర్యాడికల్స్ను ఎప్పటికప్పుడు తొలగించి కణాలను రక్షిస్తాయి.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేసి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. జామకాయలో ఉండే విత్తనాలను తినవచ్చు. వీటితో ఎలాంటి హానీ కలగదు. ఇవి పూర్తిగా సురక్షితమే. జామకాయ లేదా పండులో ఉండే విత్తనాలను ఎటువంటి అనుమానం లేకుండా తినండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

