కొవ్వును కరిగించి, గుండెను కాపాడే మ్యాజిక్ పొడి ఇదే!
Phool makhana Weight Loss Tips In Telugu : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక బరువు మరియు శరీరంలో పేరుకుపోతున్న చెడు కొలెస్ట్రాల్ (Bad Cholesterol). శరీరంలో అదనపు కొవ్వు పెరగడం వల్ల పొట్ట రావడమే కాకుండా, రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
అయితే, జిమ్లకు వెళ్లకుండానే మన వంటింట్లో దొరికే సహజమైన పదార్థాలతో తయారుచేసిన ఈ ఒక్క పొడితో అదనపు కొవ్వుకు చెక్ పెట్టవచ్చు. ఈ పొడిని సరైన పద్ధతిలో తీసుకుంటే శరీరంలోని కొవ్వు మంచులా కరిగిపోవడమే కాకుండా, గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. అసలు ఆ అద్భుతమైన పొడి ఏంటి? దాన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి? ఎప్పుడు, ఎలా తీసుకోవాలి? అనే పూర్తి వివరాలను ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలో అధిక బరువు సమస్య అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తుంది. బరువు తగ్గటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నా సరే పెద్దగా ఫలితాలు ఇవ్వక చాలా మంది నిరాశకు గురి అవుతూ ఉంటారు.

మార్కెట్లో దొరికే కొన్ని రకాల ప్రొడక్ట్స్ కూడా వాడి అలసిపోయి ఉంటారు. బరువు తగ్గటానికి మన ఇంటిలో సహజ సిద్ధంగా ఒక పొడి తయారు చేసుకుని వాడితే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ పొడి బరువును తగ్గించడానికి కాకుండా మన ఆరోగ్యానికి. కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
పొయ్యి వెలిగించి పాన్ పెట్టి రెండు కప్పుల ఫూల్ మఖానా వేసి డ్రై రోస్ట్ చేయాలి. ఆ తర్వాత 20 బాదం పప్పులను డ్రై రోస్ట్ చేయాలి. ఆ తర్వాత నాలుగు స్పూన్ల అవిసె గింజలను కూడా డ్రై రోస్ట్ చేయాలి. ఆ తర్వాత అర కప్పు కొబ్బరి ముక్కలను కూడా ట్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని కాస్త చల్లరానివ్వాలి.
మిక్సీ జార్ లో వేగించి పెట్టుకున్న ఫూల్ మఖానా, బాదంపప్పు, అవిసె గింజలు, ఎండు కొబ్బరి ముక్కలు, రెండు స్పూన్ల బెల్లం పొడి వేసి మెత్తని పొడిగా మిక్సీ చేసుకోవాలి. ఈ పొడిని ఫ్రిజ్ లో నిలువ చేస్తే మూడు వారాల వరకు నిల్వ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదా నీటిలో ఒక స్పూన్ పొడి కలిపి తీసుకోవాలి. .
ఈ విధంగా తీసుకుంటూ ఉంటే 15 రోజుల్లోనే మీకు తేడా ఖచ్చితంగా కనబడుతుంది. శరీరంలో జీవక్రియ రేటును పెంచి అదనంగా ఉన్న కొవ్వును కరిగించి వేగంగా బరువు తగ్గటానికి సహాయపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు కూడా ఏమి ఉండవు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

